Fruits: పండ్లు తినే సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. అలా చేస్తే ప్రమాదమే..!

Fruits Health Benefits: ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు తీసుకోవడం చాలా మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆహారంలో పండ్లను భాగం చేసుకోవడం

Fruits: పండ్లు తినే సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. అలా చేస్తే ప్రమాదమే..!
Fruits Health Benefits
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 27, 2021 | 10:09 AM

Fruits Health Benefits: ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు తీసుకోవడం చాలా మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆహారంలో పండ్లను భాగం చేసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొవడంతోపాటు.. ఆరోగ్యంగా ఉండవచ్చు. వీటిలో ఉండే విటమిన్లు, పొటాషియం, మినరల్స్ వంటి పోషకాలు శరీరానికి చాలా ముఖ్యమైనవి. పండ్ల విశిష్టత గురించి చెప్పాలంటే.. వీటిని తినడం వల్ల మనం చాలా రోజులు జీవించవచ్చంటున్నారు నిపుణులు. పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుందని.. వ్యాధులు కూడా దరి చేరవని పేర్కొంటున్నారు.

అయితే ఈ పండ్లను మనం సరైన రీతిలో తినకపోతే నష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్లను ఆరోగ్యానికి మంచివిగా భావిస్తూ.. ప్రజలు తరచూ అనేక తప్పులు చేస్తారు. ఇలా చేయడం వల్ల మంచి కంటే.. ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. అలాంటి తప్పులు చేయొద్దని సూచిస్తున్నారు. పండ్లను తినేటప్పుడు మీరు తరచుగా చేసే తప్పులతో ఎలాంటి అనర్ధాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.

సరైన సమయం పండ్లు ఆరోగ్యానికి మంచివని ప్రజలు అనుకుంటారు. కావున వాటిని ఎప్పుడైనా తినవచ్చు. కానీ అది కరెక్ట్ కాదు. చాలా పండ్లను తినడానికి ఉదయం ఉత్తమ సమయంగా పేర్కొంటున్నారు. ఇందులో అరటి షేక్, యాపిల్స్, ఇతర పండ్లు ఉన్నాయి. సిట్రస్ పండ్లు తరచుగా అసిడిటీకి కారణమవుతాయి. నారింజ కాలానుగుణంగా తీసుకుంటే మంచిది. ఈ పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తింటే.. ప్రయోజనానికి బదులు ఎక్కువ హాని కలిగుతుంది.

పుచ్చకాయ – నీరు పిల్లలే కాదు, పెద్దలు కూడా పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడాన్ని మనం తరచుగా చూస్తూనే ఉంటాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలా చేయడం వల్ల అతిసారం లేదా కలరా వంటి తీవ్రమైన వ్యాధికి దారి తీస్తుంది. వాస్తవానికి ఈ పండ్లలో చాలా నీరు ఉంటుంది. ఈ కారణంగా పుచ్చకాయ తిన్న తర్వాత నీరు వెంటనే నీరు తాగొద్దని సూచిస్తున్నారు.

పండ్ల ఎంపిక.. చాలా మంది పండ్లను వాటి ప్రభావాన్ని బట్టి ఎంచుకోకపోవటం వల్ల కూడా నష్టం చేకూరుతుంది. వేడిగా పైనాపిల్, నారింజ, అరటి వంటి పండ్లను తీసుకుంటే వారికి సమస్యలు రావొచ్చంటున్నారు నిపుణులు. చల్లని బొప్పాయి, మామిడి వంటి పండ్లను కూడా తినకూడదని సూచిస్తున్నారు.

పెరుగు లేదా పాలతో పండ్లు.. చాలా మంది ప్రజలు పెరుగు లేదా పాలతో పండ్లను తినడానికి ఇష్టపడతారు. అయితే ఇది కూడా హానికరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పద్ధతి రుచికరమైనదిగా అనిపించినప్పటికీ.. దీని కారణంగా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. పెరుగు, పండు కలిపి తింటే అనేక కడుపు సమస్యలు వస్తాయని వాటికి దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు.

రాళ్ల సమస్య కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా ఎలాంటి పండ్లను తీసుకోకూడదు. ఇది వారికి ప్రయోజనం కలిగించే బదులు వారికి హాని కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:

Sugar Apple: సీతాఫలం ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. లాభాల కంటే నష్టాలే ఎక్కువట..! అవేంటో తెలుసుకోండి

Beauty Tips: చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి

గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!