ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా ? ఇక మీ పని అంతే.. ఎందుకో తెలుసుకోండి..
మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థం మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కేవలం ఆహారం మాత్రమే కాదు.. మనం తినే సమయాన్ని
మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థం మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కేవలం ఆహారం మాత్రమే కాదు.. మనం తినే సమయాన్ని బట్టి కూడా అనారోగ్య సమస్యలను నియంత్రించడం లేదా మరింత పెంచడం వంటివి జరుగుతుంటాయి. కొన్ని ఆహార పదార్థాలను సరైన సమయానికి తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని పదార్థాలను ఖాళీ కడుపుతో తీసుకున్న.. ఉదయాన్నే తిన్నా.. లేదా సరైన సమయంలో కాకుండా వేరే టైంలో తీసుకున్న తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోవద్దు. నిజానికి కడుపు ఖాళీగా ఉన్నప్పుడు బ్యాక్టీరియా..ఇతర రసాయానాలు విడుదలవుతాయి. దీంతో కడుపులో ఆమ్లం పెరిగే అవకాశం ఉంది. అందుకే ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోవద్దు. అవెంటో తెలుసుకుందామా.
సాధారణంగా మజ్జిగ శరీరానికి మేలు చేస్తుంది. కానీ ఖాళీ కడుపుతో మజ్జిగ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం కడుపులోకి వెళ్లడం ద్వారా బ్యాక్టీరియాను చంపుతుంది. బ్యాక్టీరియా కడుపులోకి ఎసిడిటీ పెరగకుండా చేస్తుంది. అందుకే ఖాళీ కడుపుతో మజ్జిగ తాగితే ఎసిడిటీ సమస్య పెరుగుతుంది.
అలాగే ఖాళీ కడుపుతో చక్కెరను అస్సలు తీసుకోవద్దు. చక్కెరను జీర్ణం చేయడానికి ఉదయం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. దీంతో రక్తంలో చక్కెర శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఖాళీ కడుపుతో చక్కెరను అస్సలు తీసుకోవద్దు..
కూల్ డ్రింక్స్ కూడా ఉదయం పూట, ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోవద్దు. ఇవి ఆరోగ్యానికి హానికరం. ఇవి కడుపులో ఎసిడిటీని కలిగిస్తుంది. అలాగే ఉబ్బరం సమస్య కూడా వస్తుంది. ముఖ్యంగా అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో సిట్రస్ పండ్లు అస్సలు తీసుకోవద్దు. ఇందులో కార్బోనేటేడ్ పదార్థం వంటి కలిగి ఉంటుంది. ఇవి ఎసిడిటి సమస్యను పెంచుతుంది. ఇందులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో మసాలా పదార్థాలను తీసుకోవద్దు. ఖాళీ కడుపుతో గరం మసాల తీసుకోవడం వలన కడుపు నొప్పి వస్తుంది. ఇది ఛాతీలో మంటను కూడా కలిగిస్తుంది. అలాగే ఖాళీ కడుపుతో మసాలా తీసుకోవడం వలన గ్యాస్ పెరుగుతుంది.
Also Read: Ram Gopal Varma: ఇదేంది సామీ.. కేక్‌ను ఇలా కట్ చేస్తారా.. వర్మ రచ్చ మాములుగా లేదుగా..