Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2022 Mega Heros Movies: కొత్త ఏడాదిలో ఫ్యాన్స్‌కు మెగా హీరోల బోనాంజా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్..

2022 Mega Heros Movies: దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలోనే కాదు బహుశా భారత దేశ చలన చిత్ర పరిశ్రమలోనే కపూర్ ఫ్యామిలీ తరహా మెగా ఫ్యామిలీ కూడా ఒక చెరిగిపోని రికార్డ్ సృష్టించిందని..

2022 Mega Heros Movies: కొత్త ఏడాదిలో ఫ్యాన్స్‌కు మెగా హీరోల బోనాంజా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్..
Mega Heros Movies
Follow us
Surya Kala

|

Updated on: Dec 26, 2021 | 12:55 PM

2022 Mega Heros Movies: దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలోనే కాదు బహుశా భారత దేశ చలన చిత్ర పరిశ్రమలోనే కపూర్ ఫ్యామిలీ తరహా మెగా ఫ్యామిలీ కూడా ఒక చెరిగిపోని రికార్డ్ సృష్టించిందని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి దాదాపు 10 మంది వరకూ హీరోలు ఉన్నారు. అంతేకాదు చిరంజీవి వారసులుగా వెండి తెరపై ఎంట్రీ ఇచ్చినా.. తమదైన శైలితో నటిస్తూ.. అభిమానులను సొంతం చేసుకున్నారు.. తమకంటూ సొంత ఐడెంటిని క్రియేట్ చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. అంతేకాదు అభిమానుల్లో మెగా అభిమానులు వేరు.. బ్లడ్ బ్రదర్స్ గా చిరంజీవి తన అభిమానులను ట్రీట్ చేస్తారు. అయితే కొత్త సంవత్సరం మెగా ఫ్యాన్స్  సరికొత్త ట్రీట్ ను ఇవ్వనుంది.

2022 సంవత్సరంలో మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ లు తమ తమ సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మెగా హీరోల సినిమాలు 2022 ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అందుకనే 2022 ఏడాది మెగాఫ్యాన్స్ కు చాలా ప్రత్యేకంగా నిలవనుంది.

2022 సంవత్సరసంలో మెగా ఫ్యామిలీ నుంచే 14 సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమాతో పాటు, పవన్ కళ్యాణ్ రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్ ను ప్రకటించుకున్నాయి.

చిరంజీవి నటించిన ‘ఆచార్య’ మూవీ ఫిబ్రవరి 4న విడుదలకు రెడీగా ఉంది.  మూడు వారాల గ్యాప్ తో తమ్ముడు పవన్ భీమ్లా నాయక్ తో సందడి చేయనున్నాడు. ఫిబ్రవరి 25న రిలీజ్ కానున్నది. అంతేకాదు.. పవన్ కల్యాస్ హిస్టారికల్ మూవీ    ‘హరిహర వీరమల్లు’ దసరా బరిలో ఉంది.. వరుణ్ తేజ్ ‘గని’ మార్చి 2022..’ఎఫ్-3’మూవీ ఎప్రిల్ -29 విడుదల కానున్నాయి. సంక్రాంతి బరిలో రామ్ చరణ్, తారక్ నటించిన మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ జనవరి -7 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నది. అయితే కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడనున్నదనే టాక్ కూడా వినిపిస్తోంది. అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ కూడా 2022 లోనే రిలీజ్ కానున్నదని తెలుస్తోంది.

రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబో తెరకెక్కుతున్న సినిమా కూడా దసరా కానుకగా రిలీజ్ కానున్నదని టాక్. అంతేకాదు చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’, ‘గాడ్ ఫాదర్’ లు కూడా 2022లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్  తాజా మూవీ గిరీశయ్య, కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’, ‘కిన్నెరసాని’ మూవీలు కూడా వేసవి వినోదంగా రానున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. అల్లు శిరీష్ సినిమా కూడా 2022లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద మెగా హీరోల సందడే సందడి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి , పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందంటే అభిమానులకు పండగే.. ఎదుకంటే ఇండస్ట్రీలో చిరు, పవన్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది అభిమానులు ఉన్నారు.

Also Read :  నేను వ్యాక్సిన్ బూస్టర్ ఇవ్వమని చెప్పాను.. కేంద్రం పాటించింది: రాహుల్ గాంధీ