Charan-Bunny: మెగా వారసులంతా కలిసి ప్రేక్షకులకు క్రిస్మస్ ట్రీట్.. ఒకే పిక్‌లో చెర్రీ, బన్నీ, సహా మెగా కజిన్స్ కనుల విందు..
Charan-Bunny: క్రీస్తు పుట్టిన రోజున క్రిస్మస్ గా దేశ విదేశాల్లోని ప్రజలు జరుపుకుంటారు. సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలని ఘనంగా జరుపుకున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ..
Charan-Bunny: క్రీస్తు పుట్టిన రోజున క్రిస్మస్ గా దేశ విదేశాల్లోని ప్రజలు జరుపుకుంటారు. సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలని ఘనంగా జరుపుకున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ కూడా క్రిస్మస్ పండగను ఘనంగా జరుపుకుంది. తాజాగా మెగా ఫ్యామిలీ యంగ్ జనరేషన్ కు చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకే ఫేమ్ లో కొణిదెలవారి ఫ్యామిలీ అల్లు వారి ఫ్యామిలీ ఉన్న ఫోటో మెగా అభిమానులను అలరిస్తుంది.
మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా క్రిస్మస్ వేడుక సందర్భంగా ఒక్క చోట చేరారు. అందరూ కలిసి సందడి చేశారు. మెగా వారసులంతా కలిసి ప్రేక్షకులకు మంచి క్రిస్మస్ ట్రీట్ ఇచ్చారు. రామ్ చరణ్, తన భార్య ఉపాసన, అల్లు అర్జున్ స్నేహారెడ్డి దంపతులు, కొత్త జంట నిహారిక చైతనలతో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, శ్రీజ, తదితరులు ఒకే ఫ్రేమ్ కనిపించి ఫ్యాన్స్ కు కనుల విందు చేశారు.
ముఖ్యంగా బావాబావమరుదులు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ ఎప్పుడు ఎలా ఏ సందర్భంలో కలిసినా మెగా అభిమానులు థ్రిల్ ఫీలవుతారు. పుష్ప హిట్ సూపర్ జోష్ లో ఉన్న బన్నీ.. ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి సందడి చేయడం అందరినీ ఆకట్టుకుంది. క్రిస్మస్ వేడుకల్లో బన్నీ, చెర్రీ, వరుణ్, సాయిధరమ్, వైష్ణవ్ సహా మెగా డాటర్స్ సుస్మిత, శ్రీజ , నీహారిక ఇతర కజిన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ ఫొటోలో శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్ మాత్రం మిస్ అయ్యారు.