Vaccine Booster Dose: ప్రధాని మోడీ బూస్టర్ డోస్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న ఆప్-కాంగ్రెస్ నేతలు .. ఎవరు ఏం చెప్పారంటే..

Vaccine Booster Dose: కరోనా వైరస్ థర్డ్ వేవ్ రానున్నదంటూ వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్న వేళ.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడమే కాదు.. నెక్స్ట్ దశకు సంబందించిన..

Vaccine Booster Dose: ప్రధాని మోడీ బూస్టర్ డోస్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న ఆప్-కాంగ్రెస్ నేతలు .. ఎవరు ఏం చెప్పారంటే..
Booster Dose And Vaccine
Follow us
Surya Kala

|

Updated on: Dec 26, 2021 | 8:44 AM

Vaccine Booster Dose: కరోనా వైరస్ థర్డ్ వేవ్ రానున్నదంటూ వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్న వేళ.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడమే కాదు.. నెక్స్ట్ దశకు సంబందించిన విషయాన్నీ ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించిన సమయంలో ప్రకటించారు. దేశంలోని పిల్లలతో పాటు, ఫ్రంట్ లైన్ వారియర్స్  సహా 60 ఏళ్ళు పైబడిన వృద్దులకు వివిధ రోగాలతో బాధపడుతున్నవారికి ముందు జాగ్రత్త మోతాదు ఇవ్వనున్నామని ప్రకటించారు.

ప్రధాని మోడీ ప్రకటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇది స్వాగతించే చర్య అని అన్నారు. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌ డోస్‌ను ప్రారంభించడం హర్షించదగిన పని అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. స్కూలు, కాలేజీలకు వెళ్లే పిల్లల పట్ల మోడీ కి ఉన్న ప్రేమని ఇది తెలియజేస్తుంది. పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇస్తే.. వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందకుండా ఉంటాయి. మోడీకి థాంక్స్ అని చెప్పారు.

ఇక కరోనా వైరస్ పై ధైర్యంగా పోరాడుతూ దేశానికి అద్భుతమైన సేవ చేశారని అన్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆరోగ్యానికి సంబంధించి.. బూస్టర్ డోసు ఇవ్వాలని నిర్ణయించినందుకు మోడీని అభినందిస్తున్నానని చెప్పారు. ఒమిక్రాన్ వైరస్ గురించి భయపడకుండా..  మునుపటిలా అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించాలని ప్రజలను అమిత్ షా కోరారు.

 మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే  

మరోవైపు, బూస్టర్ డోస్ ఇవ్వాలన్న ప్రధాని మోడీ నిర్ణయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్వాగతించారు. అంతేకాదు కేబినెట్ సమావేశంలో కూడా ఈ విషయం చర్చించినట్లు చెప్పారు. పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే  పిల్లలకు టీకాలు వేయాలని, బూస్టర్ డోస్‌లు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రిని అభ్యర్థిస్తూ డిసెంబర్ 7న లేఖ రాశారు.  15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టీకాలు వేయడం ఖచ్చితంగా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుందని అన్నారు. వివిధ వ్యాధులతో ఉన్న సీనియర్ సిటిజన్లు కూడా బూస్టర్ డోస్ ఇవ్వడం మంచి ప్రయోజనం ఇస్తుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చెప్పారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్: 

ప్రధాని మోడీ ప్రకటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ..    ప్రధానమంత్రి ఫ్రంట్‌లైన్ కార్మికుల కోసం బూస్టర్ డోస్ ప్రకటించినందుకు తాను సంతోషంగా ఉన్నానని చెప్పారు. అయితే దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని సూచించారు. 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం చాలా  సంతోషకరమైన విషయమని చెప్పారు.

కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ: 

కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, వివిధ రోగాలతో బాధపడుతున్న వ్యక్తుల కోసం వ్యాక్సిన్ బూస్టర్ ప్రొటెక్షన్ డోస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక అభినందనలు..  ధన్యవాదాలు అని ఆనంద్ శర్మ ట్వీట్ చేశారు. పిల్లలకు వ్యాక్సిన్‌ వేయాలన్న  నిర్ణయాన్ని స్వాగతించారు.

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర

మనమందరం కలిసి మన ప్రజలను కాపాడుకుందామని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర చెప్పారు. అంతేకాదు ప్రధాని మోడీ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు. మహువా మొయిత్రా ట్వీట్ చేస్తూ గౌరవనీయులైన మోడీ  ఫ్రంట్‌లైన్ కార్మికులకు బూస్టర్ ఇవ్వాలనే నిర్ణయం హర్షదాయకమని తెలిపారు.

Also Read:  అమెరికాలో జంతువులను వదలని కరోనా.. 129 జింకల్లో మూడు రకాల వైరస్‌ల గుర్తింపు..