AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2021: మార్కెట్ల దూకుడు.. పెట్రో పరుగు.. భారతీయ యువతలో బిజినెస్ మూడ్.. ఈ ఏడాది ఇవే టాప్!

కోవిడ్ సెకెండ్ వేవ్ ప్రభావంతో కాలగమనంలో మరో ఏడాది కరిగిపోయింది. గతేడాదిలానే ఈ ఏడాది కూడా కొన్ని నెలలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, గతేడాది మాదిరిగా వాణిజ్య రంగం ఈసారి తీవ్ర ఒడుదొడుకులకు గురికాలేదు. దేశంలో సాధారణ పరిస్థితులే నెలకొన్నాయా అన్నంతగా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు, జీఎస్టీ వసూళ్లలో కొంత వరకు దూకుడు కనిపించింది. ఐపీవోలు సైతం మార్కెట్లో సందడి చేస్తూ ఎంట్రీ ఇచ్చాయి. ఎన్నడూ లేని స్థాయిలో స్టాక్‌ మార్కెట్‌వైపు యువతరం శ్రద్ధగా పరుగులు పెట్టింది. దీనికి తోడు డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. ఇదిలావంటే సెకెండ్ వేవ్ లాక్‌డౌన్ తర్వాత పెట్రో ధరలు ఆకాశాన్ని చూశాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దమొత్తంలో ఆదాయం సమకూరింది. ఇలాంటి వాటితో వాణిజ్య భారత్ ఓ ఏడాది దాటుకుని ముందుకు అడుగులు వేస్తోంది. ఇలాంటి కొన్ని టాప్ ఇష్యూస్‌ను ఓ సారి చూద్దాం..

Sanjay Kasula

|

Updated on: Dec 26, 2021 | 3:48 PM

Stock Market

Stock Market

1 / 8
Petrol Diesel Prices: ఈ ఏడాది కరోనా తర్వాత ఎక్కువగా ప్రజలు మాట్లాడుకున్న అంశాం ఏంటంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెగుదల. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వీటి ధరలు సెంచరీ కొట్టాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలకు దేశీయ సుంకాలు తోడై సామాన్యుడి జేబులకు చిల్లు పెట్టాయి. అయితే, ఈ ఏడాది దీపావళికి ముందు కేంద్రం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. పలు రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను తగ్గించాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొంతమేర దిగొచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యాట్‌ తగ్గించకపోవడంతో అదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి.

2 / 8
Demat

Demat

3 / 8
Year Ender 2021: మార్కెట్ల దూకుడు.. పెట్రో పరుగు.. భారతీయ యువతలో బిజినెస్ మూడ్.. ఈ ఏడాది ఇవే టాప్!

4 / 8

5 / 8
Gst Collections: ఇదిలావుంటే.. మొదటి కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ సమయంలో పడిపోయిన జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది మాత్రం భారీగా పుంజుకున్నాయి. మే (రూ.97వేల కోట్లు), జూన్‌ (రూ.92 వేల కోట్లు) నెలలు మినహాయిస్తే అన్ని నెలలూ రూ.లక్ష కోట్ల మేర వసూళ్లు అయ్యాయి. జనవరిలో రూ.1.19 లక్షల కోట్లు వసూలు కాగా.. ఏప్రిల్‌లో గరిష్ఠంగా రూ.1.39 లక్షల కోట్లు మేర జీఎస్టీ రూపంలో ఖజానాకు చేరింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం కావడం గమనార్హం. నవంబర్‌లో సైతం రూ.1.31 లక్షల కోట్లు వసూలయ్యాయి.

6 / 8
Rupee Value: 2021 ఏడాది ఆరంభం నుంచి చురుగ్గా కదలాడిన రూపాయి చివరికొచ్చేసరికి మాత్రం నేల చూపులు చూసింది. 2021జనవరిలో డాలరుతో రూపాయి విలువ రూ.73గా కాగా.. ఏడాదంతా దాదాపు 73 నుంచి 75 మధ్యే కొనసాగింది. అయితే, డిసెంబర్‌ 16న 76.28కి చేరింది. గతేడాది ఏప్రిల్‌ 24 తర్వాత రూపాయి ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. వడ్డీ రేట్ల పెంపునకు అమెరికా ఫెడ్‌ సిద్ధమవవ్వడానికి తోడు ఒమిక్రాన్‌ భయాలు రూపాయి విలువ ఒక్కసారిగా పడేశాయి.

7 / 8
జవసత్వాలు నింపేందుకు: కరోనాతో ఇబ్బంది పడుతున్న ఆర్ధిక వ్యవస్థకు జవసత్వాలు నింపేందుకు కేంద్ర సర్కార్ అనేక చర్యలు చేపట్టింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 3.0 పేరుతో కొత్త పథకాలకు ప్రకటించింది. ఇందులో ఉత్పత్తి రంగానికి ఊతమిచ్చేలా పలు ప్రోత్సాహకాలను తీసుకొచ్చింది. పీఎల్‌ఐ కింద దాదాపు 13 రంగాలకు లక్షల కోట్లు విలువ చేసే ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఇటీవల సెమీకండక్టర్ల పరిశ్రమకు రూ.76 వేల కోట్ల ప్రోత్సాహకాలను అందించింది. అంతకుముందు ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టెక్స్‌టైల్స్‌, టెలికాం, పునరుత్పాదక ఇంధనం, ఔషధ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చింది. ఈ పథకం కింద ఎంపికైన సంస్థలకు పలు రాయితీలు ఇచ్చింది.

8 / 8
Follow us