AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: నేడు ‘మన్ కీ బాత్’.. ఒమిక్రాన్ సహా కీలక అంశాలపై ప్రసంగించనున్న ప్రధాని మోదీ

Mann Ki Baat – Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 11 గంటలకు ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రతినెలా జరిగే రేడియో

PM Narendra Modi: నేడు ‘మన్ కీ బాత్’.. ఒమిక్రాన్ సహా కీలక అంశాలపై ప్రసంగించనున్న ప్రధాని మోదీ
Pm Narendra Modi
Shaik Madar Saheb
|

Updated on: Dec 26, 2021 | 8:27 AM

Share

Mann Ki Baat – Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 11 గంటలకు ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రతినెలా జరిగే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 84వ ఎపిసోడ్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. దీనిలో ప్రధాని మోదీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తోపాటు ఎన్నో విషయాలపై ప్రసంగించనున్నారు. మోదీ ప్రసంగం.. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, న్యూసోనైర్ మొబైల్ యాప్‌లో ప్రసారం కానుంది. కాగా.. దేశంలో కరోనావైరస్ మహమ్మారి కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో న్యూ ఇయర్ వేడుకలు, పండుగలు ఉన్న నేపథ్యంలో శనివారం ప్రధాని మోదీ ప్రజనుద్దేశించి ప్రసంగించారు. అయితే పెరుగుతున్న ఒమిక్రాన్ కరోనా కేసుల మధ్య.. మరోసారి ప్రధాని మోదీ పలు కీలక విషయాలపై ప్రసంగించే అవకాశం ఉంది. దీంతోపాటు పలు సూచనలు కూడా చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్ చేసి వెల్లడించింది.

కాగా.. అక్టోబర్ 3, 2014న ప్రసారమైన మన్ కీ బాత్ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం నాడు ప్రసారం అవుతుంది. 2021 చివరి ఎపిసోడ్ నవంబర్ 28న ప్రసారం అయింది. దీనిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర విషయాలపై సంభాషిస్తారు.

Also Read:

RRR Movie: వారిని మాత్రమే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా థియేటర్లలోకి అనుమతించాలి.. జక్కన్న సినిమాపై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు..

Omicron: ఏపీలో ఒమిక్రాన్‌ టెన్షన్.. మరో రెండు కొత్త కేసులు నమోదు..