Omicron: ఏపీలో ఒమిక్రాన్‌ టెన్షన్.. మరో రెండు కొత్త కేసులు నమోదు..

Omicron variant Corona cases: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులను అధికారులు గుర్తించారు. ఈ రెండు కేసులో కలిపి ఏపీలో ఒమిక్రాన్‌

Omicron: ఏపీలో ఒమిక్రాన్‌ టెన్షన్.. మరో రెండు కొత్త కేసులు నమోదు..
ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకపోయినా.. ఎలాంటి కాంటాక్ట్ లేకపోయినా ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. ఇలాంటి కేసులే తెలంగాణలో 3 వెలుగులోకి వచ్చాయి. ఒమిక్రాన్ పేషెంట్లతో ఎలాంటి కాంటాక్ట్ లేని.. ఓ ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్, ఓ గర్భిణితో పాటు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది.
Follow us
uppula Raju

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 26, 2021 | 8:08 AM

Omicron variant Corona cases: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులను అధికారులు గుర్తించారు. ఈ రెండు కేసులో కలిపి ఏపీలో ఒమిక్రాన్‌ కేసులు ఆరుకు చేరాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ మీదుగా ప్రకాశం జిల్లాకు వచ్చిన 48 ఏళ్ల వ్యక్తి కి, యూకే నుంచి అనంతపురం వచ్చిన మరో వ్యక్తికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు వెల్లడైంది. అయితే వారి కుటుంబ సభ్యులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష లో నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఏపీకి 67 మంది విదేశాల నుంచి వచ్చారని వారిలో 12 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్టు ప్రభుత్వం పేర్కొంది.

ఇదిలా ఉంటే డిసెంబర్‌ 24న రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి కోనసీమ అయినవెల్లి మండలం నేదునూరిపాలెనికి చెందిన మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవలే ఈ మహిళ కువైట్‌ నుంచి వచ్చింది. యూఏఈ నుంచి విశాఖ వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి ఓమిక్రాన్ నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ఇద్దరిని క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక అంతకు ముందు కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నమోదైంది. కెన్యా నుంచి వచ్చిన మహిళ.. చెన్నై విమానాశ్రయం నుంచి తిరుపతికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దేశంలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజురోజుకూ పెరుగుతోంది. భారత్‌లో ఇప్పటివరకు 358 పైగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Yuvraj singh: అంతరిక్షంలోకి వెళ్లిన యువరాజ్‌ సింగ్‌ బ్యాట్‌.. ఎలాగో తెలుసా..?

యాషెస్ సిరీస్ జరుగుతుండగా బాధాకరమైన వార్త.. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మరణించాడు..

Amazon: ఇయర్ ఎండ్ సేల్‌ని ప్రకటించిన అమెజాన్.. OnePlus, Xiaomiతో సహా ఈ ఫోన్లపై భారీ తగ్గింపు..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!