AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covaxin: కోవాక్సిన్ ట్రయల్స్‌లో పిల్లల్లో పెరిగిన ఇమ్యూనిటీ..! పెద్దలలో కంటే మెరుగైన ఫలితాలు..

Covaxin: కోవాక్సిన్ పిల్లల్లో మంచి రోగనిరోధక శక్తిని పెంచుతుందని కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కె అరోరా అన్నారు. 15 నుంచి18 ఏళ్ల లోపు

Covaxin: కోవాక్సిన్ ట్రయల్స్‌లో పిల్లల్లో పెరిగిన ఇమ్యూనిటీ..! పెద్దలలో కంటే మెరుగైన ఫలితాలు..
Corona Vaccine
Follow us
uppula Raju

|

Updated on: Dec 27, 2021 | 6:52 AM

Covaxin: కోవాక్సిన్ పిల్లల్లో మంచి రోగనిరోధక శక్తిని పెంచుతుందని కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కె అరోరా అన్నారు. 15 నుంచి18 ఏళ్ల లోపు ల‌బ్దిదారుల‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌వేశ‌పెట్టాల‌న్న ప్ర‌ధాన మంత్రి నిర్ణ‌యంపై హర్షించారు. భారతదేశంలో కోవిడ్ కారణంగా మరణిస్తున్న వారిలో దాదాపు మూడింట రెండొంతుల మంది 15-18 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే అన్నారు. దేశంలోని మా పరిశోధనలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయని స్పష్టం చేశారు. పిల్లలకు టీకాలు వేయడం వల్ల మరో రెండు ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. మొదట వారు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లవలసి ఉంటుంది. ఓమిక్రాన్‌ ఇన్ఫెక్షన్లకు గురవుతారు.

రెండోది చాలా సార్లు పిల్లలు వారి ఇంట్లోనే ఇన్ఫెక్షన్ బారిన పడతారు. ఎందుకంటే వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల వల్ల ఇది జరుగుతుందన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని 15 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. శనివారం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా భారత్ బయోటెక్ కోవాక్సిన్‌ను 12-18 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారుల కోసం అత్యవసర ఉపయోగం కోసం ఆమోదించింది. దీనిపై డాక్టర్ అరోరా మాట్లాడుతూ వ్యాక్సిన్ ట్రయల్‌లో పిల్లల్లో మంచి రోగనిరోధక శక్తిని కనబరిచిందన్నారు.

కోవాక్సిన్ ట్రయల్స్‌లో పిల్లలలో చాలా మంచి రోగనిరోధక శక్తిని చూపించింది. నిజానికి ఇది పెద్దల కంటే కొంచెం మెరుగ్గా ఉంది. రెండోది ఇది సురక్షితమైన టీకా. మన పిల్లలకు ఈ రక్షణ కల్పించాలన్నారు. అలాగే చాలా పాఠశాలలు తెరిచిన సంగతి తెలిసిందే. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి ఇప్పటికీ సిద్దంగా లేరు కాబట్టి ఈ టీకా ప్రచారం వారిలో విశ్వాసాన్ని నింపుతుందుని విశ్వాసం వ్యక్తం చేశారు.

బ్లాక్‌ కలర్‌ క్యాప్‌, వైట్‌ మాస్క్‌తో స్టైలిష్‌గా సెల్ఫీ తీసుకుంటున్న ఈ స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టగలరా?

EPFO: పీఎఫ్ ఖాతా బదిలీ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..