AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్లాక్‌ కలర్‌ క్యాప్‌, వైట్‌ మాస్క్‌తో స్టైలిష్‌గా సెల్ఫీ తీసుకుంటున్న ఈ స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టగలరా?

బ్లాక్‌ కలర్‌ క్యాప్‌, వైట్‌ మాస్క్‌ పెట్టుకుని సెల్ఫీలకు పోజ్‌ ఇచ్చిన ఈ నటుడు ఇప్పుడు టాలీవుడ్‌లో నంబర్‌ వన్‌ స్టార్ హీరో. క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా

బ్లాక్‌ కలర్‌ క్యాప్‌, వైట్‌ మాస్క్‌తో స్టైలిష్‌గా సెల్ఫీ తీసుకుంటున్న ఈ స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టగలరా?
Basha Shek
| Edited By: |

Updated on: Dec 27, 2021 | 7:09 PM

Share

బ్లాక్‌ కలర్‌ క్యాప్‌, వైట్‌ మాస్క్‌ పెట్టుకుని సెల్ఫీలకు పోజ్‌ ఇచ్చిన ఈ నటుడు ఇప్పుడు టాలీవుడ్‌లో నంబర్‌ వన్‌ స్టార్ హీరో. క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా ఇలా స్టైలిష్‌గా తయారయ్యాడీ హ్యాండ్సమ్‌ హీరో. బాలనటుడిగా అడుగుపెట్టిన అతను అనతికాలంలోనే సూపర్‌స్టార్‌గా గుర్తింపుతెచ్చుకున్నాడు. బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొడుతూ అవార్డులతో పాటు అశేష అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక తన స్టైలిష్‌ లుక్‌తో అమ్మాయిల ఫేవరెట్‌ హీరోగా మారిపోయాడు. ఓ బాలీవుడ్ నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా అతనికి కుమారుడు, కూతురు ఉన్నారు. అన్నట్లు సినిమాల్లోనే కాదు సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటాడీ హీరో. తన ఫ్యామిలీ, పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తుంటాడు. అందులో భాగంగానే ఇలా స్టైలిష్‌గా దర్శనమిచ్చాడు. ఇంతకీ ఈ హ్యాండ్సమ్‌ హీరో ఎవరంటే.. మన టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ ప్రిన్స్‌ మహేశ్‌బాబు.

క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా తన గారాల పట్టి సితారతో కలిసి ఇలా సెల్ఫీలకు స్టైలిష్‌గా పోజ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ‘సర్కార్ వారి పాట’ సినిమాలో నటిస్తున్న మహేశ్‌ సర్జరీ కారణంగా కొన్ని రోజుల పాటు కెమెరాకు దూరంగా ఉంటున్నాడు. కాగా పరుశురామ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మొదటి సారి మహేష్‌తో జత కట్టింది ‘మహానటి’ కీర్తిసురేష్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇక మహేష్ పుట్టిన రోజున విడుదలైన టీజర్ అభిమానుల అంచనాలను ఆకాశానికి చేర్చింది. సినిమా విషయానికొస్తే.. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కుతుందని సమాచారం. సముద్ర ఖని, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Also Read: EPFO: పీఎఫ్ ఖాతా బదిలీ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

KYC Update: ఈ రెండు అకౌంట్లు మీకు ఉన్నాయా.. అయితే వెంటనే ఈ పని చేయండి.. లేదంటే క్లోజ్ అయ్యే అవకాశం..!