Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KYC Update: ఈ రెండు అకౌంట్లు మీకు ఉన్నాయా.. అయితే వెంటనే ఈ పని చేయండి.. లేదంటే క్లోజ్ అయ్యే అవకాశం..!

మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే లేదా షేర్లను కొనుగోలు చేసి విక్రయించాలనుకుంటే, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా కలిగి ఉండటం అవసరం. ఈ రెండు ఖాతాలు ఇప్పటికే తెరచి ఉంటే..

KYC Update: ఈ రెండు అకౌంట్లు మీకు ఉన్నాయా.. అయితే వెంటనే ఈ పని చేయండి.. లేదంటే క్లోజ్ అయ్యే అవకాశం..!
Demat Account
Follow us
Venkata Chari

|

Updated on: Dec 27, 2021 | 6:41 AM

Demat Account: మీకు డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా ఉంటే, వెంటనే దాని కేవైసీ చేయండి. డిసెంబర్ 31 నాటికి పూర్తి కాకపోతే, ఆ తర్వాత షేర్లు లేదా స్టాక్‌ల కొనుగోలు, అమ్మకాలపై ప్రభావం చూపే అవకా: ఉంది. సెబీ (SEBI) (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల KYCని పూర్తి చేసేందుకు 30 సెప్టెంబర్ 2021ని చివరి తేదీగా ప్రకటించింది. ఆ తర్వాత దానిని 31 డిసెంబర్ 2021 వరకు పొడిగించింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో, సెబీ KYC తప్పనిసరి అంటూ ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. డీమ్యాట్ లేదా ట్రేడింగ్ ఖాతా ఉన్నవారు తమ పేరు, చిరునామా, పాన్, మొబైల్ నంబర్, ఆదాయాలు, సరైన ఈమెయిల్ ఐడీని కేవైసీ కింద అప్‌డేట్ చేసుకోవాలని, లేకుంటే తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని సర్క్యులర్‌లో పేర్కొంది.

సెబీ కొత్త రూల్ ఏంటంటే? మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే లేదా షేర్లను కొనుగోలు చేసి విక్రయించాలనుకుంటే, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా కలిగి ఉండటం అవసరం. ఈ రెండు ఖాతాలు ఇప్పటికే తెరచి ఉంటే, దానికి KYC పూర్తి చేయడం అవసరం. ఆదాయ సమాచారం కూడా KYCలో పేర్కొనాలి. బ్రోకరేజ్ కంపెనీలు చాలా కాలంగా ఈ సమాచారాన్ని వినియోగదారులకు అందజేస్తున్నాయి. ఈ పని డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలని, లేకుంటే అకౌంట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందని మెసేజ్‌లు పంపిస్తున్నారు.

వాస్తవానికి, కొత్త నిబంధనలో, జూన్ 1, 2021 తర్వాత తెరిచిన లేదా తెరవబోయే అన్ని డీమ్యాట్ లేదా ట్రేడింగ్ ఖాతాలలో ఆరు రకాల సమాచారాన్ని అందించడం అవసరం అని పేర్కొన్నారు. ఈ సమాచారంలో, పేరు, చిరునామా, పాన్, చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్, ఆదాయాలు, సరైన ఇమెయిల్ ఐడిని పేర్కొనడం అవసరం. అలాగే, కస్టమర్ల ఆధార్ నంబర్‌ను వారి పాన్‌తో లింక్ చేయాలి. ఎవరైనా దీన్ని చేయకుంటే లేదా KYCలో ఈ సమాచారాన్ని అందించకపోతే, అప్పుడు డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు తొలిగిస్తామని తెలిపారు.

కేవైసీ పూర్తి చేయకపోతే ఏమి జరుగుతుంది.. నిబంధనల ప్రకారం, ఖాతాదారుడు డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలో ఈ సమాచారాన్ని అప్‌డేట్ చేయకపోతే, అతని ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. అతని ఖాతాలో ఇప్పటికే ఉన్న షేర్లు లేదా పోర్ట్‌ఫోలియో అలాగే కొనసాగుతుంద. కానీ, కొత్తగా ట్రేడింగ్‌ను చేయలేరు. ఈ ఖాతాలో కేవైసీ వివరాలు అప్‌డేట్ చేశాక మాత్రమే మళ్లీ యాక్టివేట్ అవుతుంది. దీనికి సంబంధించి సీడీఎస్ఎల్, ఎన్డీఎస్ఎల్ ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశాయి.

స్టాక్ మార్కెట్ పనిని పారదర్శకంగా చేయడానికి, షేర్ హోల్డింగ్ గురించి పూర్తి సమాచారాన్ని పొందడానికి, కేవైసీకి ప్రాధాన్యత ఇచ్చారు. కేవైసీతో సెబీ వాటా కొనుగోలు, విక్రయానికి సంబంధించిన పూర్తి ఖాతాను కలిగి ఉంటుంది. దీంతో పన్ను ఎగవేతకు కూడా చెక్ పడనుంది. కేవైసీలో పాన్ సమాచారం తప్పనిసరి. ఇది పన్ను శాఖకు ఆదాయాలు మొదలైన వాటి గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించగలదు.

Also Read:

BSNL Prepaid Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ ధరతో రోజు 5జీబీ డేటా ప్లాన్‌

Aadhaar Link: మీ బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింక్‌ చేశారా..? ఏయే బ్యాంకుకు అనుసంధానం అయ్యిందో తెలుసుకోండిలా..!