Sunny Leone: ఆ వీడియో డిలీట్ చేయాల్సిందే.. లేకుంటే కఠిన చర్యలు.. సన్నీ లియోన్‌కు హోంమంత్రి వార్నింగ్..!
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఓ వీడియో తీసిన బాలీవుడ్ యాక్టర్ సన్నీ లియోన్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోను 3 రోజుల్లో డిలీట్ చేయాలని, లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని మధ్యప్రదేశ్ హోంమంత్రి..
Madhuban Mein Radhika Nache: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఓ వీడియో తీసిన బాలీవుడ్ యాక్టర్ సన్నీ లియోన్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోను 3 రోజుల్లో డిలీట్ చేయాలని, లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరించారు. ఈ మేరకు సన్నీ లియోన్‌తోపాటు ఆ పాట పాడిన వారిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
షరీబ్, తీషి పాడిన ‘మధుబన్ మే రాధిక నాచే’ పాట హిందీలో విడుదలైంది. ఈ సాంగ్‌లో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సందడి చేసింది. ఈనెల 22న ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు అర్చకులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ పాట 1960లో వచ్చిన ‘కోహినూర్’ సినిమాలోని ‘మధుబన్ మే రాధిక నాచే రే’ అనే పాటను పోలి ఉంటుంది.
గత ఐదు రోజులు పలు వర్గాల నుంచి కూడా అభ్యంతరాలు ఎక్కువయ్యాయి. ఈ నేసథ్యంలో మధ్యప్రదేశ్ హోంమంత్రి కూడా మాట్లాడుతూ, కావాలనే కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటున్నారంటూ పేర్కొన్నారు. ఈ వీడియో కూడా అలాంటిదేనని, సన్నీ లియోన్‌తోపాటు పాటపాడిన వారు కూడా క్షమాపణ చెప్పాలన్నారు. రెండు, మూడ్రోజుల్లోగా ఈ అభ్యంతరకర వీడియోను తొలగించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
హోంమంత్రి హెచ్చరికలతో వీడియోను రిలీజ్ చేసిన సరిగమప మ్యూజిక్ కంపెనీ పాటలోని కొన్ని పదాలను మర్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. ప్రజలను ఇబ్బంది పెట్టే లిరిక్స్ ఉంచబోమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. కాగా, మార్చిన పాటను రెండు, మూడు రోజుల్లో విడుదల చేస్తామని పేర్కొంది.
Also Read: Manikka Vinayagam: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సింగర్, నటుడు మాణిక్య వినాయగం కన్నుమూత
Bigg Boss 5 Telugu Shanmukh: దీప్తి నన్ను బ్లాక్ చేసింది.. బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చిన షణ్ముఖ్..