Bigg Boss 5 Telugu Shanmukh: దీప్తి నన్ను బ్లాక్ చేసింది.. బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చిన షణ్ముఖ్..

సాఫ్ట్‏వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‏తో షణ్ముఖ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

Bigg Boss 5 Telugu Shanmukh: దీప్తి నన్ను బ్లాక్ చేసింది.. బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చిన షణ్ముఖ్..
Shanmukh
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Dec 27, 2021 | 11:29 AM

షణ్ముఖ్ జస్వంత్.. యూట్యూబ్‏లో వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సాఫ్ట్‏వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‏తో షణ్ముఖ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో షణ్ముఖ్ ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన సూర్య వెబ్ సిరీస్ కూడా అదే రేంజ్‏లో సూపర్ హిట్ కావడంతో షణ్ముఖ్ యూట్యూబ్ స్టార్‏గా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే క్రేజ్‏తో బిగ్‏బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టాడు. అయితే షన్నూ బిగ్‏బాస్ సీజన్ 5 విన్నర్ అవుతాడని అంతా అనుకున్నారు. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బిగ్‏బాస్ టైటిల్ రేసులో ముందున్న షణ్ముఖ్ ఆ తర్వాత.. సిరితో స్నేహం.. శ్రుతి మించిన హగ్గులతో తనను మరింత దిగజార్చుకున్నాడు. అలాగే సిరి గురించి పొసెసివ్‏గా మాట్లాడడం.. ఆమెపై అరవడం కూడా షన్నూను పూర్తిగా నెగిటివ్ చేసిందనే చెప్పుకోవాలి. దీంతో బిగ్‏బాస్ టైటిల్ రేసులో రన్నరప్ గా మిగిలి టైటిల్ చేజార్చుకున్నాడు.

అయితే బిగ్‏బాస్ ఇంట్లోకి రాకముందే షణ్ముఖ్, దీప్తి సునయన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సిరి…కూడా శ్రీహాన్‍ను ఎంగేజ్మెంట్ చేసుకోని బిగ్‏బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే హౌస్ లో వీరిద్దరి ఆడియన్స్ కు అంతగా రుచించలేదు. దీంతో వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే బిగ్‏బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాకా మేమిద్దరం స్నేహితులమే అంటూ క్లారిటీ ఇచ్చింది సిరి. ఇక షన్నూ అయితే రూమర్స్ రావడం కొత్తేమి కాదంటూ ఇప్పుడు తెల్చీ చెప్పేశాడు. తాజాగా తన ఇన్ స్టా లైవ్ లోకి వచ్చిన షణ్ముఖ్.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో ఎక్కువగా దీప్తి సునయన గురించి అడగడంతో బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చాడు షన్నూ. ప్రస్తుతం తనను బ్లాక్ చేసిందని.. కోపం వచ్చినా.. అలిగిన ఇలాగే బ్లాక్ చేస్తుందని.. త్వరలోనే హైద్రాబాద్ వెళ్లి తనను కలుస్తానని చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. దీప్తి నా వల్ల చాలా నెగిటివిటిని ఫేస్ చేసింది. అయినా నా కోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను. ఇక తనతో బ్రేకప్ మాత్రం జరగదు. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపును వదలను అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.

Also Read:  Ram Gopal Varma: ఇదేంది సామీ.. కేక్‏ను ఇలా కట్ చేస్తారా.. వర్మ రచ్చ మాములుగా లేదుగా..

Naveen Polishetty: అఫీషియల్ అనౌన్స్‎మెంట్ వచ్చేసిందిగా.. యూవీ బ్యానర్‏లో నవీన్ పోలిశెట్టి సినిమా.. హీరోయిన్ ఎవరంటే..

Rakul Preet Singh: హ్యాపీ బర్త్ డే మై సన్‌షైన్.. ప్రియుడికి స్వీట్‌గా బర్త్‌ డే విషెస్‌ చెప్పిన పంజాబీ బ్యూటీ..

2022 Mega Heros Movies: కొత్త ఏడాదిలో ఫ్యాన్స్‌కు మెగా హీరోల బోనాంజా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..