Manikka Vinayagam: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సింగర్, నటుడు మాణిక్య వినాయగం కన్నుమూత
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత సింగర్, నటుడు మాణిక్య వినాయగం (73) నింగికెగశారు. చాలాకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న మాణిక్య వినాయగం.. పరిస్థితి తీవ్రంగా మారడంతో ఆదివారం కన్నుమూశారు.
Manikya Vinayagam: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత సింగర్, నటుడు మాణిక్య వినాయగం (73) నింగికెగశారు. చాలాకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న మాణిక్య వినాయగం.. పరిస్థితి తీవ్రంగా మారడంతో ఆదివారం కన్నుమూశారు. 1943 డిసెంబరు 10న మాణిక్యం జన్మించారు. ప్రమఖ సింగర్సీఎస్ జయరామన్ చెంత సంగీతం నేర్చుకున్నాడు. 2001 నుంచి సినీ రంగంలో తన సత్తా చాటుతూ దూసుకెళ్లారు.
2001లో దిల్ అనే తమిళ సినిమాతో సింగర్‌గా పరిచయమయ్యారు. అనంతరం దాదాపు అన్ని భాషల్లో తన గాత్రాన్ని వినిపించారు. ఇప్పటి వరకు సుమారు 800లకిపైగా సాంగ్స్ పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సినిమా పాటలతోపాటు ఆధ్యాత్మిక, జానపద గీతాలను కూడా మాణిక్యం పాడారు. ఇక తెలుగుతో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలో ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’ పాటతో ఆకట్టుకున్నారు.
కేవలం పాటలతోనే కాకుండా నటుడిగాను తన సత్తా చూపించి ప్రేక్షకులను మెప్పించారు. మాణిక్య వినాయగం మృతి పట్ల తమిళనాడు సీకం స్టాలిన్‌తోపాటు సినీ రంగానికి చెందిన ఎంతోమంది సోషల్ మీడియాలో తమ సంతాపం తెలియజేశారు.
Also Read: Bigg Boss 5 Telugu Shanmukh: దీప్తి నన్ను బ్లాక్ చేసింది.. బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చిన షణ్ముఖ్..