Radhe Shyam: రాధేశ్యామ్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసం రంగంలోకి..
Radhe Shyam: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన ప్రీరిలీజ్...
Radhe Shyam: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేసిన ట్రైలర్ రాధేశ్యామ్‌పై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ప్రభాస్ క్యారెక్టర్, రాధాకృష్ణ మేకింగ్ స్టైల్‌తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా వచ్చే జనవరి 14న విడుదల కానుంది. ఇదిలా తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ఇచ్చింది. రాధేశ్యామ్ చిత్రానికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఫిదా చేశాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు రాధేశ్యామ్ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసం యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ను రంగంలోకి దింపారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలకు తమన్ నేపథ్య సంగీతాన్ని అందించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి కారణం తమన్ ఇటీవల బ్యాక్‌గ్రౌండ్ అందించిన ‘అఖండ’కు మంచి రెస్పాన్స్ రావడమే. మరి తమన్ అందించనున్న సంగీతం రాధేశ్యామ్‌కు ఎంత వరకు దోహద పడుతుందో చూడాలి.
We are pleased to welcome the young music maestro @MusicThaman to score the BGM of #RadheShyam for South Languages!#Prabhas @hegdepooja @director_radhaa @justin_tunes @UV_Creations @TSeries @GopiKrishnaMvs pic.twitter.com/S2T1r568IE
— UV Creations (@UV_Creations) December 26, 2021
ఇక రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే జ్యోతిష్యుడి పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
సినిమా టికెట్ రేట్స్ పెంచడంపై నిర్మాత నట్టికుమార్ అసహనం.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తా అంటూ..
Vangaveeti Radha: ‘నన్ను చంపడానికి రెక్కీ చేశారు’.. వంగవీటి రాధా సంచలన ఆరోపణలు