Naveen Polishetty: మెరిసిపోతున్న ‘జాతిరత్నం’.. వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న నవీన్ పోలిశెట్టి..
చిచ్చోరే, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలతో హీరోగా పాపులారిటీని సంపాదించుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ యంగ్ హీరో
చిచ్చోరే, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలతో హీరోగా పాపులారిటీని సంపాదించుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ యంగ్ హీరో ఇటీవల జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఫుల్ జోష్ మీదున్నాడు. జాతిరత్నాలు సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టికి వరు ఆఫర్లు వచ్చాయని.. వాటికి ఈ యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోవడంతో అవన్నీ రూమర్లుగా మిగిలిపోయాయి. ఇదిలా ఉంటే.. ఈరోజు నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు కావడంతో అతని తదుపరి చిత్రాలకు సంబంధించిన వరుస అప్డే్ట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ హీరోయిన్ అనుష్కతో ఓ మూవీ చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. తాజాగా నవీన్ పోలిశెట్టి నుంచి మరో మూవీ అప్డేట్ వచ్చేసింది.
నవీన్ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థలు సంయుక్త నిర్మాణంలో ప్రొడక్షన్ నంబర్ 15గా ఓ చిత్రం రూపొందనుంది. ఈరోజు హీరో నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను నవీన్ పోలిశెట్టి ఇంట్రడ్యూసింగ్ పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం. కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వినోదం పరమావధిగా నవీన్ పోలిశెట్టి సరికొత్త అవతారం ఈ చిత్రం సొంతమని… ప్రేక్షకులుగా మీరు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయుత్త మవ్వండి, మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాము అంటున్నారు చిత్రయూనిట్. చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ మూవీ టైటిల్.. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్యలు తెలిపారు.
ట్వీట్..
The Entertainer is coming back to deliver the entertainment royale ??
Wishing a very Happy Birthday to the young sensation @naveenpolishety ❤️
Title out soon! ?#HBDNaveenpolishetty #NaveenPolishetty4 @kalyanshankar23 @vamsi84 #SaiSoujanya @SitharaEnts pic.twitter.com/hYEbn0A3wP
— Fortune Four Cinemas (@Fortune4Cinemas) December 26, 2021
The Entertainer is coming back to deliver the entertainment royale ??
Wishing a very Happy Birthday to the young sensation @naveenpolishety ❤️
Title out soon! ?#HBDNaveenpolishetty #NaveenPolishetty4 @kalyanshankar23 @vamsi84 #SaiSoujanya @Fortune4Cinemas pic.twitter.com/1fXTs66Bam
— Sithara Entertainments (@SitharaEnts) December 26, 2021
Also Read: Ram Gopal Varma: ఇదేంది సామీ.. కేక్‌ను ఇలా కట్ చేస్తారా.. వర్మ రచ్చ మాములుగా లేదుగా..