Corona Variants: జింకల వల్ల కరోనా కొత్త వేరియంట్‌..! హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు..

Corona Variants: జింకల కారణంగా మానవులు మరో కొత్త కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. దీనిపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి

Corona Variants: జింకల వల్ల కరోనా కొత్త వేరియంట్‌..! హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు..
Deer
Follow us

|

Updated on: Dec 27, 2021 | 7:19 AM

Corona Variants: జింకల కారణంగా మానవులు మరో కొత్త కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. దీనిపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి వైల్డ్ వైట్-టెయిల్డ్ జింకలో వైరస్‌కి సంబంధించి కొత్తగా మూడు రకాల వేరియంట్లు కనుగొన్నారు. యుఎస్‌లోని ఒహియోలో ఈ అధ్యయనం జరిగింది. జంతువులు వైరస్‌కు ‘రిజర్వాయర్’గా పనిచేస్తాయని వాటి నుంచి మరింత ప్రమాదకరమైన వైవిధ్యాలు వెల్లడవుతాయని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా వెలుగులోకి వస్తున్న కొత్త కోవిడ్‌ రకాలు ఆందోళనను మరింత పెంచాయి. మరోవైపు ప్రపంచ దేశాలలో ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది.

ఒహియో స్టేట్ యూనివర్శిటీలో అధ్యయనం సీనియర్ ప్రొఫెసర్ ఆండ్రూ బౌమాన్ ఇలా అన్నారు, “ఇతర అధ్యయనాల నుంచి వచ్చిన సాక్ష్యాల ఆధారంగా అడవిలో జింకలు వైరస్ బారిన పడతాయని మాకు తెలుసు. దీని కారణంగా వైరస్ జింక నుంచి జింకకు వ్యాపిస్తుంది. వైరస్ వాటి లోపల ఉంటే అప్పుడది SARS-CoV-2 కొత్త వైవిధ్యాల రూపంలో మానవులకు సోకవచ్చు. 360 జంతు నమూనాలలో మూడో వంతులో జింకలలో మూడు రకాలు కనుగొన్నారు. ఆరు వేర్వేరు చోట్ల వీటిని గుర్తించారు” అని తెలిపారు.

జింకలలో వైరస్ వ్యాప్తికి ఆధారాలు ఉన్నాయి. అవి మరింత ప్రమాదకరమైన వేరియంట్‌లను బయటకు తీసుకురాగలవని ఇది సూచిస్తుంది. జనవరి, మార్చి 2021 మధ్య జింకల నుంచి నమూనాలను సేకరించారు. ఈ సమయంలో డెల్టా వేరియంట్ లేదా మరే ఇతర వేరియంట్ బహిర్గతం కాలేదు. కానీ తరువాత జీనోమ్ సీక్వెన్సింగ్ నుంచి ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. వాస్తవానికి జింకలలో కనిపించే వైవిధ్యాలు స్థానిక కోవిడ్ రోగులలో కనిపించే వాటిని పోలి ఉంటాయి. వైరస్ వైవిధ్యాల ఉనికి అడవి జింకలలో ఉంటుందని ఇది సూచిస్తుంది. జింకకు ఎలా సోకింది జంతువు శరీరంలో వైరస్ ఎలా ప్రవర్తిస్తుందో ఇంకా తెలియరాలేదు.

ఈ ఫలితాల ఆధారంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి 13.5 నుంచి 70 శాతం వరకు ఉందని పరిశోధకులు చెబుతున్నారు. జింకలలో వైరస్ ఉండటం వల్ల రెండు విషయాలు జరుగుతాయని ప్రొఫెసర్ బోమన్ చెప్పారు. మొదటి విషయం ఏంటంటే జింకలో కోవిడ్ మ్యుటేషన్ కారణంగా కొత్త వేరియంట్‌ మానవులతో సహా ఇతర జాతులకు చేరుకుంటుంది. రెండోది ఈ వేరియంట్లను మన రోగనిరోధక శక్తి ఎదుర్కోకపోవచ్చు. ఇలా జరిగితే మానవులకు ఇబ్బంది పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉన్న కొత్త రకాలతో ఆందోళన చెందుతున్నారు.

Covaxin: కోవాక్సిన్ ట్రయల్స్‌లో పిల్లల్లో పెరిగిన ఇమ్యూనిటీ..! పెద్దలలో కంటే మెరుగైన ఫలితాలు..

IND vs PAK: ఉత్కంఠ పోరులో భారత్‌పై గెలిచిన పాక్‌.. చివరి వరకు పోరాడినా ఫలితం తారుమారు..

Omicron: ఏపీలో ఒమిక్రాన్‌ టెన్షన్.. మరో రెండు కొత్త కేసులు నమోదు..

చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..