Viral Video: మ్యాగీ.. షరబత్ కాంబినేషన్ ఫుడ్.. మాకు ఇష్టమైన చిరుతిండిని పాడుచేయవద్దంటున్న నెటిజన్లు..

Viral Video: రోజు రోజుకీ విభిన్న రుచులు కావాలంటూ.. తినే ఆహారాల పై రకరకాల ప్రయోగాలను చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇటువంటి..

Viral Video: మ్యాగీ.. షరబత్ కాంబినేషన్ ఫుడ్.. మాకు ఇష్టమైన చిరుతిండిని పాడుచేయవద్దంటున్న నెటిజన్లు..
Maggi With Roofafza
Follow us
Surya Kala

|

Updated on: Dec 27, 2021 | 7:02 PM

Viral Video: రోజు రోజుకీ విభిన్న రుచులు కావాలంటూ.. తినే ఆహారాల పై రకరకాల ప్రయోగాలను చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఇటువంటి వీడియోలను షేర్ చేస్తూ.. కొంతమంది తయారు చేస్తున్న ఆహారపదర్ధాలు  ఆకట్టుకుంటే.. మరికొందరు చేసే ప్రయోగాల పేరుతొ చేస్తున్న ఆహారపదార్ధాలు వద్దు బాబోయ్ అనిపిస్తుంటాయి.. అటువంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. షరబత్ ని ఉపయోగించి తయారు చేస్తున్న మ్యాగీ వీడియోపై నెటిజన్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే..

ప్రస్తుతం స్నాక్స్ ఐటెం గానే కాదు.. చిరు తిండిలో మ్యాగీది ప్రత్యేక స్థానం. స్ట్రీట్ ఫుడ్ లో కూడా మ్యాగీకి స్పెషల్ ప్లేస్ ఉంది. దీంతో మ్యాగీతో రకరకాల ప్రయోగాలను చేస్తూ ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నారు.  అయితే కొన్ని మ్యాగీ ప్రయోగాలు భయంకరంగా ఉంటూ.. వద్దు బాబోయ్ అనిపిస్తున్నాయి.

తాజాగా ప్రముఖ ఫుడ్ బ్లాగర్ అర్జున్ చౌహాన్ రూహఫ్జా ఓ మ్యాగీ రెసిపీని షేర్ చేశారు. స్ట్రీట్ ఫుడ్ తయారు చేస్తున్న మ్యాగీ వీడియో అనూజ్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.  ఒక వ్యక్తి షరబత్ బాటిల్‌ని షేక్ చేసి మ్యాగీ ప్లేట్‌లో కలుపుతున్న వీడియో అది. ఈ షరబత్ మ్యాగీని అనూజ్ రుచి చూశాడు.  ఈ వీడియో 3.3 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు నెటిజన్ల నుండి నిరసనను సొంతం చేసుకుంది. కొందరు తమకు ఇష్టమైన చిరుతిండిని నాశనం చేశారంటూ నిరాశను వ్యక్తం చేయగా.. మ్యాగీలో షరబత్ కాంబినేషన్ ఏమిటి ఇంత భయంకరమైన కాంబినేషన్ మేము ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్ చేస్తున్నారు.

Also Read:  సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇస్తే కలుస్తాం.. టికెట్ ధర మాత్రమే కాదు.. అనేక సమస్యలున్నాయన్న నిర్మాత దిల్ రాజు..