Viral Video: గేటు దూకి పెంపుడు కుక్కను నోటకరుచుకుని ఎత్తుకెళ్లిన చిరుత‌.. చూస్తే వణుకు పుట్టాల్సిందే!

ఈ మధ్యకాలంలో అడవి మృగాలు జనావాసాల్లోకి రావడం జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు కొన్ని సోషల్ మీడియాలో...

Viral Video: గేటు దూకి పెంపుడు కుక్కను నోటకరుచుకుని ఎత్తుకెళ్లిన చిరుత‌.. చూస్తే వణుకు పుట్టాల్సిందే!
Leopard Attack
Follow us

|

Updated on: Dec 27, 2021 | 6:44 PM

ఈ మధ్యకాలంలో అడవి మృగాలు జనావాసాల్లోకి రావడం జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సింహం, పులి, చిరుత వంటి క్రూర జంతువుల వేట అత్యంత భయంకరంగా ఉంటుంది. అందుకు సంబంధించిన వీడియోలు మీరు చూసే ఉంటారు. ఈ కోవకు చెందిన ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అడవిలో ఉండాల్సిన చిరుత రోడ్డుపైకి వచ్చి.. అది కూడాను ఓ ఇంట్లోకి చొరబడి ఏం చేసిందో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్‌కు గురవుతారు.

ఈ సంఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలియలేదు. అడవికి ద‌గ్గర‌గా ఉన్న ఓ గ్రామంలోకి చిరుత‌ ప్రవేశించింది. ఓ ఇంట్లోని పెంపుడు కుక్క గేటు ముందు నిల‌బ‌డి అరుస్తోంది. రాత్రి వేళ కావ‌డంతో ఎవ‌రూ దానిని పెద్దగా ప‌ట్టించుకోలేదు. అలా మొరిగిన ఆ కుక్క స‌డెన్‌గా అక్కడి నుంచి ప‌రుగులు తీసినట్లు మీరు వీడియోలో చూడవచ్చు. అనూహ్యంగా ఆ గేట్ అవతల నుంచి లోపలికి ఓ చిరుత దూకి కుక్కను నోట కరుచుకుని ఒక్క ఉదుటున వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన విజువల్స్‌ దగ్గరలోని సీసీటీవీలో రికార్డయ్యాయి.

కాగా, ఈ వీడియోను ప‌ర్విన్ క‌స్వాన్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 85 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా 3 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. అలాగే నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అడవులకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో చిరుతలు కుక్కలపై దాడులు చేయడం సాధారణం అని, అందుకే యజమానులు త‌మ పెంపుడు కుక్కల మెడ‌లకు ఇనుప బెల్టులు త‌గిలించి వాటిని కాపాడుతుంటారని ఓ యూజర్‌ తన అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో తెలియచేశాడు.