Dil Raju: సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇస్తే కలుస్తాం.. టికెట్ ధర మాత్రమే కాదు.. అనేక సమస్యలున్నాయన్న నిర్మాత దిల్ రాజు..

AP CM Jagan- Dil Raju: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వెర్సస్.. సినీ పరిశ్రమ అన్నట్లు గా వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే తమ సమస్య ఒక్క టికెట్ ధర మాత్రమే కాదని.. ఇంకా భిన్న సమస్యలున్నాయని..

Dil Raju: సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇస్తే కలుస్తాం.. టికెట్ ధర మాత్రమే కాదు.. అనేక సమస్యలున్నాయన్న నిర్మాత దిల్ రాజు..
Dil Raju Jagan
Follow us
Surya Kala

|

Updated on: Dec 27, 2021 | 7:04 PM

AP CM Jagan- Dil Raju: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం వెర్సస్.. సినీ పరిశ్రమ అన్నట్లు గా వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే తమ సమస్య ఒక్క టికెట్ ధర మాత్రమే కాదని.. ఇంకా భిన్న సమస్యలున్నాయని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు చెప్పారు. అంతేకాదు ఇదే విషయంపై దిల్ రాజు స్పందిస్తూ.. తమకు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ అపాయింట్ ఇస్తే కలుస్తామన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని సమస్యలను ఏపీ ప్రభుత్వానికి వివరించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. సినిమా, మీడియా వేరు కాదని అన్నారు. ప్రజలకు వార్తలను చేరవేయడానికి మీడియా కీ రోల్ అని చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను మీడియా ప్రెజెంట్ చేసే విషయంలో సెన్సిటివ్ గా చూడమని దిల్ రాజు విజ్ఞప్తి చేశారు

త్వరలోనే ఏపీ , తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులను కమిటీ ద్వారా కలుస్తామని చెప్పారు. తెలంగాణలోనే జీవో వచ్సినట్లు ఆంధ్రప్రదేశ్ లో కూడా జీవో వస్తుందని ఆశిస్తున్నామన్నారు దిల్ రాజు. అంతేకాదు రెండు రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ కమిటీ  ఫామ్ అవుతుందని .. అప్పుడు ఏదైనా సమస్య వస్తే ఈజీగా పరిష్కరించుకోవచ్చు అంటున్నారు దిల్ రాజు.  ఏపీ  ప్రభుత్వాన్నీ నిర్మాతలు టికెట్స్ ధర విషయంతో పాటు, ఐదో షో గురించి అడుగుతున్నామని .. ఇక కరోనా సమయంలో థియేటర్స్ లో విద్యుత్ బిల్లులు వంటి అనేక సమస్యలు ప్రభుత్వ వద్దకు చేరేలా చేస్తామని చెప్పారు. అందుకనే కమిటీ ఏర్పాటు చేస్తున్నామని.. త్వరలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. దయచేసి ఎవరూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని దిల్ రాజు విజ్ఞప్తి చేశారు.

జరిగిపోయిన వాటిని తలుచుకుని ఉపయోగం లేదు.. ఏపీ ప్రభుత్వం కూడా త్వరలోనే మా సమస్యలను పరిష్కరిస్తుంది అని ఆశిస్తున్నామని చెప్పారు. ఎవరు పడితే వారు కమెంట్ చేయడం, రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదని అన్నీ త్వరలోనే సాల్వ్ అయిపోతాయని ధీమా వ్యక్తం చేశారు దిల్ రాజు. ఒక్కసారి ఏపీ ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వస్తే చాలు..అన్నారు.  కష్టమో నష్టమో.. మేం ముందుకు వెళ్ళాలి.. పెద్ద సినిమాలను ఆపలేం.. ఎలా అయినా ముందుకే వెళ్ళాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దిల్ రాజు. ఇప్పటికే థియేటర్స్  లో  సినిమాల ప్రదర్శన పై తెలంగాణ లో ఒక సిస్టం వచ్చేసింది. కనుక ఇక్కడ సమస్య లేదు.. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా సమస్య తీరుతుందని భావిస్తున్నట్లు చెప్పారు దిల్ రాజు.

Also Read:   2021 వివాదాల్లో చిక్కుకున్న టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన బాలీవుడ్ సెలబ్రెటీలు వీరే..