AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood Celebs: 2021 వివాదాల్లో చిక్కుకున్న టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన బాలీవుడ్ సెలబ్రెటీలు వీరే..

Bollywood Celebs: బాలీవుడ్లో వివాదాలు.. ఆ వివాదాలతో వైరల్ అయ్యే సెలబ్రిటీలు తక్కువేం కాదు. అయితే ఈ సంవత్సరం 2021 కూడా చాలా మంది బీ టౌన్ సెలబ్రిటీలు చిక్కుల్లో చిక్కుకుని..

Bollywood Celebs: 2021 వివాదాల్లో చిక్కుకున్న టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన బాలీవుడ్ సెలబ్రెటీలు వీరే..
Biggest Bollywood Controver
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 27, 2021 | 6:55 PM

Share

Bollywood Celebs: బాలీవుడ్లో వివాదాలు.. ఆ వివాదాలతో వైరల్ అయ్యే సెలబ్రిటీలు తక్కువేం కాదు. అయితే ఈ సంవత్సరం 2021 కూడా చాలా మంది బీ టౌన్ సెలబ్రిటీలు చిక్కుల్లో చిక్కుకుని టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు.  మొత్తం భారత దేశంలోనే సెన్సేషన్ న్యూస్ గా మారారు. అలా 2021 ఏడాదిలో టాప్‌ లో నిలిచినా ఆరుగురు సెలబ్రిటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్యన్ ఖాన్: షారుఖ్ సన్ గా పాపులర్ అయిన ఆర్యన్. ముంబయి క్రూయిజ్ షిప్‌ డ్రగ్స్‌ కేసుతో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌ గా మారారు. ఎన్సీబీ రైడ్స్‌లో పట్టుబడి జైలుకెళ్లాడు. ఇక తన కొడుకు ఆర్యన్‌ ఖాన్ ను బెయిల్ పై బయటికి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రత్నాలు చేసిన షారుఖ్ కూడా.. నెట్టింట వైరల్‌ అయ్యారు. తన కొడుకును రక్షించుకునేందుకు తండ్రిగా షారుఖ్ పడే ఆరాటానికి పలువురు బాలీవుడ్‌ సెలబ్స్‌ ఫిదా అయ్యారు.

రాజ్‌కుంద్రా: బిజినెస్‌ మ్యాన్‌గా ప్రొడ్యూసర్‌గా.. హీరోయిన్ శిల్పాశెట్టి భర్తగా నేమ్ అండ్ ఫేమ్ ఉన్న రాజ్‌కుంద్రా.. నీలి చిత్రాల ఆరోపణలతో ఒక్కసారిగా దేశం మొత్తం సెన్సేషన్ అయ్యాడు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిలకు సినిమా ఆఫర్ ఇప్పిస్తానంటూ ఆశ చూపి వారితో నీలి చిత్రాలు తెరకెక్కిస్తాడనే ఆరోపణలు రాజ్‌కుంద్రాపై బలంగా వచ్చాయి. ఆ ఆరోపణలకు తగ్గట్టే షెర్లిన్ చోప్రా లాంటి కొంత మంది నటీమణులు బాహాటంగా రాజ్‌కుంద్రా పై ఇవే ఆరోపణలు చేస్తూనే పోలీస్‌ స్టేషన్ గడప తొక్కారు. రాజ్‌కుంద్రా చీకటి వ్యాపారాన్ని రోడ్డుకీడ్చారు.

కంగనా రనౌత్:  బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదాలకు దగ్గరగా ఉంటుంది. కంగనా తన ట్వీట్లతో..నోటి జాస్తితో ఎన్నో సార్లు వార్తల్లో నిలిచింది. నిలవడమే కాదు ఏకంగా ప్రధాని మోడీ పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశంలో సెన్సేషన్ సృష్టించింది. ఇక ముంబయి కోర్టు కంగనను అరెస్టు చేయాలంటూ జారీ చేసిన అరెస్టు వారెంట్తో మరో సారి అంతటా హాట్ టాపిక్ గా మారింది కంగనా. తన కొడుకు ఫర్హన్‌ అక్తర్‌ ను పరుష పదజాలంతో దూషించినందుకు ఫర్హాన్‌ తండ్రి జావేద్‌ అక్తర్ కంగనా పై ముంబయి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ కోర్టు కంగనా పై సీరియస్ అవ్వడం.. కోర్టు ఆజ్ఙను తిరస్కరిస్తూ కోర్టుకు హాజరు కాకపోవడంతో… కంగనను అరెస్ట్ చేయండంటూ ఏకంగా అరెస్ట్ వారెంట్‌నే జారీ చేశారు ముంబయి సీజె.

అనన్య పాండే: ముంబయి క్రూయిజ్‌ షిష్ డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్ ను విచారించిన ఎన్సీబీ అధికారులు… అతడి దగ్గరి నుంచి స్వాదీనం చేసుకున్న మొబైల్ ఫోన్.. వాట్సాప్‌ డేటా ఆధారంగా అనన్య ఇంటిపై సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించడమే కాదు అనన్య ను ఠానాకు పిలిపించి మరీ విచారించారు. దీంతో అనన్య కూడా ఒక్కసారిగా బీటౌన్‌లో హాట్ టాపిక్ గా మారారు. డ్రగ్స్‌ వాడే బీ టౌన్‌ సెలబ్‌లలో అనన్య కూడా ఒకరనే టాక్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

ఐశ్యర్య రాయ్: ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్‌’ కేసులో బాలీవుడ్‌ నటి ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సమన్లు జారీ చేశారు. అనంతరం ఈడీ ఎదుట హాజరైన ఐశ్వర్యను సుమారు ఆరు గంటలపాటు పలు ప్రశ్నలు అడిగారు అధికారులు. ఈ సందర్భంగా అధికారులకు ఐశ్వర్య పలు డాక్యుమెంట్లను అందజేశారు. ఫారెన్‌ ఎక్సే్చంజ్‌ మేనేజ్‌మెంట్‌ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై కొనసాగుతున్న కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఐశ్వర్య వాంగ్మూలాన్ని తీసుకున్నారు. దీంతో ఆ విషయం అప్పట్లో సెన్సేషన్ అయింది. సోషల్ మీడియా వేదికగా ట్రెలర్స్‌కు ఐశ్యర్య టార్గెట్ అయింది.

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌: మనీ లాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్‌ చంద్రశేఖర్‌ కేసులో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ పేరు వినిపించడంతో ఆమె వార్తల్లో నిలిచింది. ఈ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు సమన‍్లు జారీ చేసిన ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అయితే, రూ.10కోట్ల విలువైన బహుమతులు సుకేష్ నుంచి తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంది జాక్వెలిన్‌. సుకేష్‌ చంద్రశేఖర్‌ నుంచి పలు ఖరీదైన బహుమతులు పొందినట్లు హాట్‌ బ్యూటీ నోరా ఫతేహీ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.

Also Read:  థియేటర్స్‌ను మూసివేయకండి.. సీఎం జగన్‌ను కలవమని సూచిస్తున్న ఆర్ నారాయణ మూర్తి..