బర్గర్ తినండి.. సైకిల్ తొక్కండి.. నో వేస్ట్.. నో రెస్ట్.. బెస్ట్ ఆఫర్ చేసిన ఓ చైనా బేకరీ..

సైకిల్ తొక్కడం అనేది ఆరోగ్యకరమైన వ్యాయామాలలో ఒకటి అని నిపుణులు అంటున్నారు. కండరాలను బలోపేతం చేయడానికి, శరీరంలోని కొవ్వును కరిగించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సైక్లింగ్ గ్రేట్‌గా సహాయపడుతుంది.

బర్గర్ తినండి.. సైకిల్ తొక్కండి..  నో వేస్ట్.. నో రెస్ట్.. బెస్ట్ ఆఫర్ చేసిన ఓ చైనా బేకరీ..
Woman Eats Burger
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 27, 2021 | 8:25 PM

సైకిల్ తొక్కడం అనేది ఆరోగ్యకరమైన వ్యాయామాలలో ఒకటి అని నిపుణులు అంటున్నారు. కండరాలను బలోపేతం చేయడానికి, శరీరంలోని కొవ్వును కరిగించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సైక్లింగ్ గ్రేట్‌గా సహాయపడుతుందనేది ఆ సంస్థ ఆలోచన. అదే సమయంలో బర్గర్లు అనారోగ్యకరమైన ఆహారం అని మనందరికి తెలిసిందే. శరీరంలోని కొవ్వును పెంచే జంక్ ఫుడ్ కేటగిరీలో బర్గర్‌ కూడా ఒకటి. బర్గర్లు, సైక్లింగ్ ఎప్పుడూ కలిసి ఉండవు కాదా? అయితే ఈ రెండింటినీ కలిపిన తన సెంటర్‌లో ఏర్పాటు చేసింది చైనాలో బేకరీ.

సైకిల్ తొక్కుతూ బర్గర్ తినడం మంచిదేనా? అనే చర్చను కూడా తెర మీదికి తీసుకొచ్చింది ఈ చైనా బేకరీ సంస్థ. ఈ బేకరీ జిమ్‌లో సైక్లింగ్ మెషిన్ ఏర్పాటు చేశారు. కస్టమర్లు బర్గర్‌లను కొనుగోలు చేసి.. నేరుగా ఈ సైక్లింగ్ మెషీన్‌పై కూర్చోని తినాల్సి ఉంటుంది. బర్గర్ తిన్న వెంటనే శరీరంలోని కొవ్వును వదిలించుకోవాలనేది ఆ సంస్థ ఆలోచన.

ఓ యువతి బర్గర్ కొని ఈ సైక్లింగ్ మెషీన్ పై సైకిల్ తొక్కుతూ బర్గర్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆల్విన్ ఫూ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసిన వీడియోలో మహిళ తన బర్గర్ డ్రింక్ తింటూ ఫిట్‌నెస్ మెషీన్‌పై వేగంగా సైక్లింగ్ చేసింది.

బర్గర్ చైన్ అందిస్తున్న కొత్త ఫీచర్‌ను కొందరు విమర్శించగా.. 5 నిమిషాల పాటు సైక్లింగ్ చేయడం వల్ల ఒకరు వినియోగించే కేలరీలలో సగం కూడా బర్న్ అవ్వదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

బర్గర్ చైన్ అందిస్తున్న కొత్త ఫీచర్‌ను కొందరు విమర్శించగా 5 నిమిషాల పాటు సైక్లింగ్ చేయడం వల్ల ఒకరు వినియోగించే కేలరీలలో సగం కూడా బర్న్ అవ్వదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి: Teachers Protest: జూనియర్లకు పట్టం కడతారా.. ఆ జీవోను రద్దు చేయాల్సిందే.. రోడ్డెక్కిన ఉపాధ్యాయులు..

Year Ender 2021: మార్కెట్ల దూకుడు.. పెట్రో పరుగు.. భారతీయ యువతలో బిజినెస్ మూడ్.. ఈ ఏడాది ఇవే టాప్!