AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Lectro: బ్లూటూత్ కనెక్టివిటీతో హీరో రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లు.. ధర ఎంతో తెలుసుకోండి..

హీరో సైకిల్స్‌కు చెందిన ఇ-సైకిళ్ల బ్రాండ్‌ ‘హీరో లెక్ట్రో’ మరో రెండు కొత్త సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఒకటి మౌంటైన్ సైకిల్ F2i మరొకటి F3i. ఎఫ్‌2ఐ పేరిట వస్తున్న..

Hero Lectro: బ్లూటూత్ కనెక్టివిటీతో హీరో రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లు.. ధర ఎంతో తెలుసుకోండి..
Hero Lectro
Sanjay Kasula
|

Updated on: Dec 27, 2021 | 9:25 PM

Share

హీరో సైకిల్స్‌కు చెందిన ఇ-సైకిళ్ల బ్రాండ్‌ ‘హీరో లెక్ట్రో’ మరో రెండు కొత్త సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఒకటి మౌంటైన్ సైకిల్ F2i మరొకటి F3i. ఎఫ్‌2ఐ పేరిట వస్తున్న సైకిల్‌ ధర రూ. 39,999 కాగా.. ఎఫ్‌3ఐ ధర రూ.40,999. సంస్థ ఆర్‌అండ్‌డీ కేంద్రంలో డిజైన్‌ చేసిన ఇ-సైకిళ్లు ఒకసారి ఛార్జ్‌ చేస్తే 35 కి.మీ వరకు ప్రయాణించగలవు. ఈ బైక్‌లు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఇవి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఈ ఉత్పత్తులతో యువతను ఆకర్షించాలని కంపెనీ భావిస్తోంది. ఈ రెండింటి ఫీచర్లు, టాప్ స్పీడ్, ఛార్జింగ్ స్పీడ్ గురించి ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం.

హీరో F2i, Hero F3i డ్రైవింగ్ రేంజ్

Hero F2i, Hero F3i డ్రైవింగ్ రేంజ్ గురించి చెప్పాలంటే.. రెండూ ఒకే ఛార్జ్‌పై 35 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తాయి. ఇందులో 7 గేర్ స్పీడ్ ఉంది. ఈ బైక్‌లలో 100 ఎంఎం సస్పెన్షన్, 27.5 అంగుళాలు, 29 అంగుళాల డబుల్ అల్లాయ్ రిమ్స్ ఉన్నాయి. అలాగే, వాటిలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఇవ్వబడ్డాయి. దీనితో పాటు రైడ్‌లకు అవసరమైన అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

హీరో F2i, Hero F3i బ్యాటరీ

మౌంటెన్ ఇ బైక్‌లు రెండూ అధిక సామర్థ్యం గల 6.4Ah బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఇది IP67 రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఈ బ్యాటరీ సహాయంతో 250W మోటార్ టార్క్ పొందుతుంది. రైడర్‌లు నాలుగు రైడింగ్ మోడ్‌లను పొందుతారు. వాటిలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని తమ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. పెడలిక్ 35 కి.మీ పరిధిని పొందగా.. థోటెల్ 27 కి.మీ. ఇది కాకుండా క్రూయిజ్,  మాన్యువల్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. స్మార్ట్ డిస్‌ప్లే సహాయంతో ఈ మోడ్‌లను మార్చుకోవచ్చు.

Hero F2i,Hero F3iలను ఎక్కడ కొనుగోలు చేయాలి

Hero F2i, F3i ఎలక్ట్రిక్ MTB సైకిల్‌లను లెక్ట్రో నెట్‌వర్క్ కింద 600 మంది డీలర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. అలాగే దీన్ని ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు,  బైక్‌ల విభాగం వేగంగా పెరుగుతోంది. వీటిలో మంచి రేంజ్ ఉన్న ద్విచక్ర వాహనం ధర సుమారు రూ. 1 లక్ష ఉంది. అటువంటి ఎలక్ట్రిక్ వాహనం కోరుకునే వారికి ఈ సైకిల్ మంచి ఎంపికగా మారవచ్చు. 4 

ఇవి కూడా చదవండి: Teachers Protest: జూనియర్లకు పట్టం కడతారా.. ఆ జీవోను రద్దు చేయాల్సిందే.. రోడ్డెక్కిన ఉపాధ్యాయులు..

Year Ender 2021: మార్కెట్ల దూకుడు.. పెట్రో పరుగు.. భారతీయ యువతలో బిజినెస్ మూడ్.. ఈ ఏడాది ఇవే టాప్!