Cricket News: వారెవ్వా.. సూపర్‌ సిక్స్‌.. షాట్‌ చూసిన ప్రేక్షకులు, వ్యాఖ్యాతలు ఫిదా అయ్యారు..

Cricket News: బిగ్ బాష్ లీగ్ ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ టోర్నమెంట్‌లలో ఒకటి. సోమవారం బ్రిస్బేన్ హీట్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన

Cricket News: వారెవ్వా.. సూపర్‌ సిక్స్‌.. షాట్‌ చూసిన ప్రేక్షకులు, వ్యాఖ్యాతలు ఫిదా అయ్యారు..
Ben Duckett Six
Follow us
uppula Raju

|

Updated on: Dec 27, 2021 | 9:43 PM

Cricket News: బిగ్ బాష్ లీగ్ ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ టోర్నమెంట్‌లలో ఒకటి. సోమవారం బ్రిస్బేన్ హీట్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుత షాట్‌ నమోదైంది. బిగ్ బాష్ లీగ్ 23వ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడుతున్న బ్యాట్స్‌మెన్ బెన్ డకెట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా సిక్స్‌ కొట్టాడు. మెల్‌బోర్న్ స్టార్స్ స్పిన్నర్ కైస్ అహ్మద్ వేసిన బంతిని బెన్ డకెట్ అద్భుతంగా సిక్సర్ కొట్టాడు. ఈ సిక్స్‌ను చాలా మంది ప్రత్యేకమైన షాట్‌గా అభివర్ణిస్తున్నారు. బ్రిస్బేన్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో బెన్ డకెట్ అద్భుతమైన రివర్స్ స్వీప్ ఆడాడు. ఆ తర్వాత బంతి నేరుగా బౌండరీ లైన్ దాటింది.

బెన్ డకెట్ అద్భుతమైన రివర్స్ స్వీప్ రివర్స్ స్వీప్‌లో చాలా మంది బ్యాట్స్‌మెన్ సిక్సర్లు కొట్టినప్పటికీ ఈ సిక్స్‌ చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. కైస్ అహ్మద్ వేసిన బంతిని బెన్ డకెట్ బౌండరీ దాటించిన విధానం అద్భుతంగా ఉంది. వ్యాఖ్యానం చేస్తున్న అనుభవజ్ఞులు కూడా డక్ షాట్‌ని బిగ్ బాష్ లీగ్ అత్యుత్తమ షాట్ అని వ్యాఖ్యానించారు. బెన్ డకెట్ ఇంగ్లాండ్ జట్టుకు తిరిగి రావడానికి చాలా కష్టపడుతున్నాడు. అతను 2019 సంవత్సరం నుంచి ఇంగ్లాండ్ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. డకెట్ ఇంగ్లండ్ తరఫున 4 టెస్టులు, 3 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు.

చలికాలంలో స్వెటర్‌ ధరించి నిద్రపోతున్నారా..! శరీరంలో జరిగే ఈ మార్పులు తెలుసుకోండి..

Rohit Sharma: రోహిత్‌ వన్డే సిరీస్‌కి కూడా దూరమేనా..! అప్పుడు వన్డే కెప్టెన్ ఎవరు..?

జాతకంలో శుక్రుడు బలంగా లేకుంటే డబ్బుకు లోటు..! ఇలా చేస్తే శుభ పరిణామాలు