Watch Video: రైఫిల్‌తో టీమిండియా మాజీ ప్లేయర్ హల్‌చల్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..!
భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ నెట్టింట్లో మరోసారి చర్చనీయాంశమయ్యాడు. ప్రవీణ్ కుమార్ రైఫిల్‌తో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో..
Viral Video: భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ నెట్టింట్లో మరోసారి చర్చనీయాంశమయ్యాడు. ప్రవీణ్ కుమార్ రైఫిల్‌తో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ప్రవీణ్ కుమార్ అలియాస్ పీకే దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ చిత్రం ‘పాన్ సింగ్ తోమర్’ పాత్రలో కనిపించాడు. వీడియోలో ఒక డైలాగ్ కూడా చెప్పాడు – యే పాన్ సింగ్ తోమర్ కా గ్యాంగ్ హై దరోగా జీ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను 9,498 మంది లైక్ చేశారు. వీడియో బ్యాక్ గ్రౌండ్ లో డైలాగ్ ప్లే అవుతోంది. ఇందులో ఫైరింగ్‌తో పాటు శబ్దం వస్తుంది. ‘అటాక్ హై గయో, పాన్ సింగ్ ఆయే గయో, భాగ్, భాగ్, భాగ్, ఓయి కిస్కా గ్యాంగ్ హై జే’. దీని తరువాత, పీకే ఇర్ఫాన్ – యే పాన్ సింగ్ తోమర్ కా గ్యాంగ్ హై దరోగా జీ అంటూ డైలాగ్ పేల్చాడు.
సురేష్ రైనా లైక్ చేసిన వీడియో.. పీకే ఈ కొత్త స్టైల్ వీడియోని సురేష్ రైనా కూడా లైక్ చేశాడు. ముఖ్యంగా రైనా, పీకే మంచి స్నేహితులు. ఇటీవల సురేష్ రైనా తన పుస్తకాన్ని ఇవ్వడానికి మీరట్‌లోని పీకే ఇంటికి వచ్చాడు. ఈ సమావేశానికి సంబంధించిన చిత్రాలను పీకే సోషల్ మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే. రైనాతో పాటు పలువురు సోషల్ మీడియా యూజర్లు కూడా ఈ వీడియోపై కామెంట్లు చేశారు.
2013లో విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్స్‌మెన్‌ను దుర్భాషలాడినందుకు ప్రవీణ్ కుమార్ సస్పెండ్ అయ్యాడు. 2012 ఆస్ట్రేలియా పర్యటనలోనూ ప్రేక్షకులతో గొడవపడ్డాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో కొంతమంది ప్రేక్షకులు రోహిత్ శర్మను దుర్భాషలాడారని ప్రవీణ్ చెప్పాడు. వారికి గుణపాఠం చెప్పాలని వారితో గొడవపడ్డట్లు చెప్పుకొచ్చాడు. ఒకసారి దేశవాళీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ప్రవీణ్ బంగారు గొలుసు చోరీకి గురైంది.
ఇరుగుపొరుగు వారిని బెదిరించి దాడికి పాల్పడినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి పిచ్‌లపై ప్రవీణ్ కుమార్ విజయం సాధించాడు. 2007లో టీమిండియాలోకి వచ్చిన తర్వాత 2012 వరకు భారత బౌలింగ్‌లో ప్రత్యేక పాత్ర పోషించాడు. కానీ, అతని కోపం కారణంగా, పలు సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది.
డిప్రెషన్ కారణంగా పీకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. పీకే 2020 జనవరిలో డిప్రెషన్‌ను ఎదుర్కొన్నాడు. ప్రవీణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – ఎవరైనా నా ఫోన్‌కు సమాధానం ఇవ్వకపోతే నేను చాలా ఒంటరిగా భావిస్తాను. ఈ విషయం నన్ను లోపల నుంచి చంపేస్తోంది. అలాంటి చెడు సమయాల్లో హరిద్వార్‌కు వెళుతుండగా నడిరోడ్డుపై తన రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అయితే తన పిల్లల ఫొటోలను చూసి కుదరలేదని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ – ఉత్తరప్రదేశ్‌కు బౌలింగ్ కోచ్ అవసరం. త్వరలో ఆ జట్టుతో తిరిగి వస్తాను. నేను మీరట్‌లో ఖాళీగా కూర్చోను. కొన్ని నెలల క్రితం నేను భయపడ్డాను. అది ఓ బ్యాడ్ టైమ్’ అంటూ చెప్పుకొచ్చాడు.
పీకే క్రికెట్ కెరీర్.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ క్రికెటర్ 68 వన్డేలు, 6 టెస్టులు, 10 టీ20లు ఆడాడు. ఆరు టెస్టుల్లో 27 వికెట్లు పడగొట్టాడు. అందులో 15 వికెట్లు 2011 ఇంగ్లండ్ పర్యటనలో తీసుకున్నాడు. ప్రవీణ్ టెస్టు కెరీర్ జూన్ 2011లో ప్రారంభమై ఆగస్టు 2011లో ముగిసింది. వన్డేల్లో 68 మ్యాచ్‌ల్లో 77 వికెట్లు, 10 టీ20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. ఆర్‌సీబీతో ఐపీఎల్‌ను ప్రారంభించి, గుజరాత్ లయన్స్‌తో ముగిసింది. 2016 ఐపీఎల్ వేలంలో గుజరాత్ అతడిని రూ.3.5 కోట్లకు కొనుగోలు చేసింది.
View this post on Instagram
Also Read: Viral Video: 14 నెలల తర్వాత సంరక్షకుడిని కలిసిన ఏనుగుల గుంపు.. వాటి ప్రేమకు నెటిజన్లు ఫిదా..
Viral Video: మ్యాగీ.. షరబత్ కాంబినేషన్ ఫుడ్.. మాకు ఇష్టమైన చిరుతిండిని పాడుచేయవద్దంటున్న నెటిజన్లు..