AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: 14 నెలల తర్వాత సంరక్షకుడిని కలిసిన ఏనుగుల గుంపు.. వాటి ప్రేమకు నెటిజన్లు ఫిదా..

Viral Video: విశ్వాసంగల జంతువు అంటే కుక్క అంటారు అయితే.. మనిషిని ప్రేమించే జంతువులో ఏనుగు కూడా ఒకటి. నిజానికి మనిషి జీవిత విధానానికి ఏనుగుల జీవన విధానానికి దగ్గర పోలికలు ఉంటాయి. తాజాగా ఏనుగుల..

Viral Video: 14 నెలల తర్వాత సంరక్షకుడిని కలిసిన ఏనుగుల గుంపు.. వాటి ప్రేమకు నెటిజన్లు ఫిదా..
Elephant Reuniting With Car
Surya Kala
|

Updated on: Dec 27, 2021 | 8:45 PM

Share

Viral Video: విశ్వాసంగల జంతువు అంటే కుక్క అంటారు అయితే.. మనిషిని ప్రేమించే జంతువులో ఏనుగు కూడా ఒకటి. నిజానికి మనిషి జీవిత విధానానికి ఏనుగుల జీవన విధానానికి దగ్గర పోలికలు ఉంటాయి. తాజాగా ఏనుగుల గుంపుకు చెందిన ఓ వీడియో వైరల్ గా మారింది. థాయ్‌లాండ్‌లోని ఒక అభయారణ్యంలో 14 నెలల తర్వాత ఏనుగుల గుంపు తమ సంరక్షకుడిని తిరిగి కలిశాయి. ఎంతో ప్రేమగా తమ సంరక్షకుడిని హత్తుకున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోను ట్విటర్‌లో బ్యూటెంగేబిడెన్ షేర్ చేసారు. ఏనుగుల గుంపు నీటిలో నడుచుకుంటూ ఎంతో సంతోషంగా తమ సంరక్షకుని వైపు నడుచుకుని వచ్చాయి. తమ సంరక్షకుడిని ఎంతో ప్రేమగా తొండంతో హత్తుకున్నాయి. అతడిని కౌగిలించుకున్నాను. దీంతో ఏనుగుల సంరక్షుడు కూడా ఏనుగులను ఎంతో ప్రేమగా తడుముతున్నాడు. వీరి ప్రేమ చూపరుల హృదయాలను హత్తుకుంది. అంతేకాదు జంతువులు మానవులకు నమ్మకమైన సహచరులు.. ఇది  చెప్పబడటానికి ఇదొక మంచి ఉదాహరణ అంటున్నారు.

ఈ వీడియో 3.7 మిలియన్లకు పైగా వ్యూస్ , 1.5 లక్షలకు పైగా లైక్‌లు సొంతం చేసుకుంది. హృదయాన్ని కదిలించే ఈ వీడియో క్లిప్ కు నెటిజన్లు ఫిదా అవ్వడమే కాదు.. షరతులు లేని స్వచ్ఛమైన ప్రేమ..  ఏనుగులు బహుశా చాలా మంది మానవుల కంటే మానవత్వం కలిగి ఉంటాయి.. .నాకు ఏనుగుల అంటే ప్రేమ.. బహుశా ఏనుగులు మానవుల కంటే మేధస్సులో ఉన్నతంగా ఉంటాయి.. దేవుడా నాకు ఏనుగులంటే చాలా ఇష్టం. వాటిని ఎల్లప్పుడూ రక్షించు అంటూ విభిన్న కామెంట్స్ చేశారు. ఏనుగులు తమ కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోవు. నేను ఏనుగులను ప్రేమిస్తున్నాను. ఈ వీడియోలో ఏనుగుల ప్రేమ చాలా అందంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: భయాన్ని దూరం చేసే ప్రసిద్ధ కాల భైరవ మందిరాలు.. 

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే