Brazil Floods: బ్రెజిల్‌లో భయానక వాతావరణం.. ఆ ఎఫెక్ట్‌తో 18 మంది మృత్యువాత..

Brazil Floods: బ్రెజిల్‌లో భయానక వాతావరణం నెలకొంది. అతిభారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ వరదల కారణంగా 18 మంది చనిపోయారు.

Brazil Floods: బ్రెజిల్‌లో భయానక వాతావరణం.. ఆ ఎఫెక్ట్‌తో 18 మంది మృత్యువాత..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 28, 2021 | 12:03 AM

Brazil Floods: బ్రెజిల్‌లో భయానక వాతావరణం నెలకొంది. అతిభారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ వరదల కారణంగా 18 మంది చనిపోయారు. సుమారు 300 మందికి వరకు గాయపడ్డారు. దాదాపు 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు బహియా అధికారులు. తాజా వర్షాలు, వరదల ప్రభావం 40కి పైగా పట్టణాలపై పడిందని వివరించారు బహియా గవర్నర్​రుయి కోస్టా. ఇది ఒక భారీ విషాదమని, బహియా చరిత్రలో ఇలాంటి భారీ వర్షాలు ఎప్పుడూ కురవలేదని చెప్పారు గవర్నర్. చాలా నగరాలు వరదల్లో చిక్కుకున్నాయని, ఇప్పటికే చాలా ఇళ్లు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు కోస్టా. భారీ వర్షాల కారణంగా ఇటాంబే నగరంలో ఓ ఆనకట్ట తెగిపోయింది. దీంతో వరదలు ముంచెత్తుతాయనే భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఇప్పటికే బహియాలో వరద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

రెండు రోజుల్లో పరిస్థితులు అదుపులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు ఆఫీసర్లు. రాబోయే 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు అక్కడి వాతావరణ శాఖ అధికారులు. బహియాలో సుమారు 50 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీమీటర్ల వరకు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అటు బహియాలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని బ్రెజిల్ వాతావరణ, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో అలెర్ట్‌ అయ్యారు అక్కడి అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించే ప్రక్రియను స్పీడప్‌ చేశారు.

Also read:

Maoist vs Police: మావోయిస్టులపై పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారా? ఆ హత్యకు, ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉందా?

Vangaveeti Radha: వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ.. ఇంటెలిజెన్స్‌ డీజీకి సీఎం ఆదేశం..

Viral Video: ఎలుగుబంటి తెలివితేటలకు నెటిజన్లు ఫిదా.. రోడ్ సేఫ్టీపై వైరల్ వీడియో..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?