AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: మైనారిటీలపై విద్వేషపూరిత ప్రసంగాలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయి.. ఆందోళన వ్యక్తం చేసిన పాకిస్తాన్!

Pakistan expressed worry about Haridwar meeting speeches against minorities at Indian diplomat

Pakistan: మైనారిటీలపై విద్వేషపూరిత ప్రసంగాలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయి.. ఆందోళన వ్యక్తం చేసిన పాకిస్తాన్!
Imran Khan
KVD Varma
|

Updated on: Dec 28, 2021 | 7:21 AM

Share

Pakistan: ఇటీవల హరిద్వార్‌లో జరిగిన ఒక సదస్సులో మైనారిటీలపై హింసను ప్రేరేపించే ఉద్దేశంతో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ పాకిస్థాన్ భారత విదేశాంగ శాఖ ఇన్‌ఛార్జ్ హైకమిషనర్‌ను పిలిపించి ఆందోళన వ్యక్తం చేసింది. డిసెంబర్ 16 నుంచి 19 వరకు హరిద్వార్‌లోని వేద్ నికేతన్ ధామ్‌లో జరిగిన ధర్మ సంసద్‌లో వక్తలు ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పాకిస్తాన్ ఆరోపించింది. ఘజియాబాద్‌లోని దాస్నా ఆలయ పూజారి యతి నరసింహానంద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలు, హింసను ప్రోత్సహించడంపై ఇప్పటికే నరసింహానంద్‌పై పోలీసుల దృష్టి ఉంది. కార్యక్రమంలో, పలువురు వక్తలు రెచ్చగొట్టే.. ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తులను చంపాలని పిలుపునిచ్చారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. విద్వేషపూరిత ప్రసంగాలను పౌర సమాజం..దేశంలోని ఒక వర్గం తీవ్ర ఆందోళనతో చూస్తోందని పాకిస్తాన్ భారతదేశానికి తెలిపింది.

పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, నిర్వాహకులు లేదా భారత ప్రభుత్వం వాటిని ఖండించకపోవటం భారతదేశానికి అత్యంత ఖండనీయమైనది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముస్లింలపై తరచూ జరుగుతున్న హింసాత్మక సంఘటనలు “ఇస్లాం పట్ల భయం విషయంలో అధ్వాన్నమైన ధోరణిని” బహిర్గతం చేశాయని.. భారతదేశంలోని ముస్లింలకు సంబంధించి అవాస్తవ చిత్రాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాయనీ విదేశాంగ కార్యాలయం పేర్కొంది.

ద్వేషపూరిత ప్రసంగాలపై విచారణ జరపాలి: పాకిస్థాన్

ఈ ద్వేషపూరిత ప్రసంగాలు మరియు మైనారిటీలపై విస్తృతమైన హింసాత్మక సంఘటనలపై భారతదేశం దర్యాప్తు చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు విదేశాంగ కార్యాలయం తెలిపింది. ఈ ద్వేషపూరిత ప్రసంగాలు, మైనారిటీలపై విస్తృతమైన హింసాత్మక సంఘటనలపై భారతదేశం దర్యాప్తు చేయాలని..భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు విదేశాంగ కార్యాలయం తెలిపింది.

ఇవి కూడా చదవండి: Maoist vs Police: మావోయిస్టులపై పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారా? ఆ హత్యకు, ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉందా?

Harassment: రెచ్చిపోయిన కీచకులు.. 15 ఏళ్ల బాలికను వేరు వేరు ప్రాంతాలు తిప్పుతూ..

Viral Video: కళ్లను మాయ చేస్తున్న తొమ్మిదో వింత.. అచ్చం చెక్క ముక్కలా..