AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

British Queen: జలియన్‌వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ ను చంపడానికి హైటెక్ ప్రయత్నం.. నిందితుడి అరెస్ట్!

క్రిస్మస్ సందర్భంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ IIను హత్య చేసేందుకు ఒక సిక్కు క్వీన్స్ ప్యాలెస్‌లోకి చొరబడ్డాడు. 1919 నాటి జలియన్‌వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ యువకుడు రాణిని చంపాలనుకున్నాడు.

British Queen: జలియన్‌వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ ను చంపడానికి హైటెక్ ప్రయత్నం.. నిందితుడి అరెస్ట్!
Queen Elizabeth 11
KVD Varma
|

Updated on: Dec 28, 2021 | 7:40 AM

Share

British Queen: క్రిస్మస్ సందర్భంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ IIను హత్య చేసేందుకు ఒక సిక్కు క్వీన్స్ ప్యాలెస్‌లోకి చొరబడ్డాడు. 1919 నాటి జలియన్‌వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ యువకుడు రాణిని చంపాలనుకున్నాడు. ఆయుధాలతో సహా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 19 ఏళ్ల యువకుడి పేరు జస్వంత్ సింగ్ ఖైల్ అని బ్రిటిష్ మీడియా పేర్కొంది. క్రిస్మస్ రోజున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఇప్పుడు తెరపైకి వచ్చింది.

రాణిని చంపే ప్రయత్నం చేస్తాను..

క్రిస్మస్ రోజున సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియోలో నిందితుడు ”నేను చేసిన దానికి క్షమించండి, నేను రాజ కుటుంబానికి చెందిన క్వీన్ ఎలిజబెత్‌ను చంపడానికి ప్రయత్నిస్తాను. 1919లో జలియన్‌వాలాబాగ్‌ మారణకాండలో మరణించిన వారి ప్రతీకారం ఇది. ఇది తమ కులం కారణంగా చంపబడిన లేదా అవమానానికి గురైన వారి ప్రతీకారం కూడా. నేను భారతీయ సిక్కు, నేను ఒక ‘సిత్’. నా పేరు జస్వంత్ సింగ్ చైల్, ఇప్పుడు నా పేరు డార్త్ జోన్స్.’ అంటూ పేర్కొన్నాడు.

మానసిక ఆరోగ్య చట్టం కింద అరెస్ట్..

స్కాట్లాండ్ యార్డ్ వీడియోపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. రాణిని చంపడానికి, నిందితుడు వింత హూడీ, ముసుగు ధరించి ప్యాలెస్‌లోకి ప్రవేశించాడు. సీసీటీవీ ఫుటేజీలో అతడు గోడ ఎక్కినట్లు కనిపించింది. అతని చేతిలో విల్లు కూడా ఉంది. మానసిక ఆరోగ్య చట్టం కింద నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

హాలీవుడ్ సినిమా స్టార్ వార్స్ నుంచి ప్రేరణ పొంది..

వీడియోలో నిందితుడు ధరించిన మాస్క్ హాలీవుడ్ సినిమా స్టార్ వార్స్ నుండి ప్రేరణ పొందినట్లు కనిపించింది. ఈ సినిమాలో ‘సిత్’ విలన్ పాత్ర. సిత్ లాగే ‘డార్త్ జోన్స్’ కూడా ఈ సినిమాతో అనుబంధం కలిగి ఉన్నాడు. చైల్ వీడియో నేపథ్యంలో స్టార్ వార్స్ పాత్ర డార్త్ మాల్గస్ చిత్రం ఉంది. దీనితో పాటు, స్నేహితులకు పంపిన సందేశంలో, నేను తప్పు చేసిన లేదా అబద్ధం చెప్పిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. మీకు ఈ సందేశం అందితే, నా మరణం దగ్గరలోనే ఉంది. ఈ వీడియోని మరింత మంది వ్యక్తులతో షేర్ చేయండి అంటూ చెప్పాడు.

జలియన్‌వాలాబాగ్‌లో ఏం జరిగింది?

1919 ఏప్రిల్ 13న బైసాఖీ రోజున అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా సమావేశమైన వేలాది మంది ప్రజలపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో వెయ్యి మందికి పైగా చనిపోయారు. ఇందులో మహిళలు, పురుషులు, పిల్లలు ఉన్నారు. 1,200 మందికి పైగా గాయపడ్డారు. వందలాది మంది మహిళలు, వృద్ధులు, చిన్నారులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడ నిర్మించిన బావిలోకి దూకి అందులోనే చనిపోయారు.

ఇవి కూడా చదవండి: Maoist vs Police: మావోయిస్టులపై పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారా? ఆ హత్యకు, ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉందా?

Harassment: రెచ్చిపోయిన కీచకులు.. 15 ఏళ్ల బాలికను వేరు వేరు ప్రాంతాలు తిప్పుతూ..

Viral Video: కళ్లను మాయ చేస్తున్న తొమ్మిదో వింత.. అచ్చం చెక్క ముక్కలా..