Maoist vs Police: మావోయిస్టులపై పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారా? ఆ హత్యకు, ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉందా?
Maoist vs Police: మావోయిస్టులపై పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారా? ఒకరిని హత్య చేస్తే.. ఆరుగురిని ఎన్‌కౌంటర్ చేశారా? ములుగు జిల్లాలో సర్పంచ్ హత్యకు, ఇప్పుడు జరిగిన
Maoist vs Police: మావోయిస్టులపై పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారా? ఒకరిని హత్య చేస్తే.. ఆరుగురిని ఎన్‌కౌంటర్ చేశారా? ములుగు జిల్లాలో సర్పంచ్ హత్యకు, ఇప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉందా? అంటే.. తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పులని గమనిస్తే అదే అనుమానం వ్యక్తమవుతోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామ సర్పంచ్‌ని వారం రోజుల క్రితం మావోయిస్టులు హత్య చేశారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్ గా వ్యవహరించడం వల్లే ప్రజా కోర్టులో కుర్సా రమేష్‌ను ప్రజా కోర్టులో శిక్షించి చంపేశామని మావోయిస్టులు ఓ లేఖ కూడా విడుదల చేశారు.
పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా మారిన రమేష్.. మావోయిస్టులకు మత్తు కలిపిన పాల ప్యాకెట్స్ ఇవ్వడం వల్ల అమాయకులైన మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌కు గురయ్యారని అనుమానించారు. 2019లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మృతి చెందడానికి రమేష్ కారణమని మావోయిస్టులు భావించారు. దీంతో అప్పటి నుంచే కుర్సా రమేష్‌పై ఓ కన్నేసి ఉంచిన మావోయిస్టులు ఇటీవల కిడ్నాప్ చేసి, ఆ తర్వాత ప్రజాకోర్టులో శిక్షించి, హత్య చేశారు.
ఆ సమయంలోనే రమేష్ వల్ల మావోయిస్టులు ఎలా చనిపోయారో ఓ లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. చర్ల ఏరియా దళ కమాండర్ శాంత పేరుతో లేఖ విడుదల చేశారు. అటు రమేష్ వాయిస్ తో ఉన్న ఆడియో కూడా రిలీజ్ చేశారు. అందులో తాను పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించిన విషయాన్ని తెలియజేశాడు కుర్సా రమేష్.
అయితే సర్పంచ్ రమేష్‌ని కిడ్నాప్ చేసిన సమయంలోనే వెంకటాపురం, చర్ల ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని కూడా కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. అయితే రమేష్‌ని హత్య చేసిన మావోయిస్టులు, మరో వ్యక్తికి మాత్రం క్షమాబిక్ష పెట్టారు. చంపకుండా వదిలేశారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం వల్లే మావోయిస్టులు, పోలీసులకు చిక్కారని తెలుస్తోంది. మావోయిస్టుల నుంచి బయటపడిన వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా తెల్లవారుజామున మావోయిస్టులపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందగా, అందులో నలుగురు మహిళలున్నట్టు తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతి చెందినట్టు సమాచారం. చర్ల మండలానికి 25 కిలో మీటర్ల దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీప్రాంతంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7.30 గంటల మధ్య కాల్పులు జరిగాయి.
Also read:
Vangaveeti Radha: వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ.. ఇంటెలిజెన్స్ డీజీకి సీఎం ఆదేశం..
Viral Video: ఎలుగుబంటి తెలివితేటలకు నెటిజన్లు ఫిదా.. రోడ్ సేఫ్టీపై వైరల్ వీడియో..
Delhi govt: విద్యార్థులకు శీతాకాలపు సెలవుల ప్రకటన.. జనవరి 1 నుంచి 15 వరకు..