AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Politics: తెలంగాణ పాలిటిక్స్‌లో మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారిన మాజీమంత్రి.. ఆయన చేసి కామెంట్స్ ఏంటంటే..!

Telangana Politics: తెలంగాణ పాలిటిక్స్‌లో మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారారు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఒక చోట ఉండి, మరొకరితో కాపురం చేయవద్దంటూ సంచలన కామెంట్స్‌ చేశారు.

Telangana Politics: తెలంగాణ పాలిటిక్స్‌లో మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారిన మాజీమంత్రి.. ఆయన చేసి కామెంట్స్ ఏంటంటే..!
Shiva Prajapati
|

Updated on: Dec 28, 2021 | 12:06 AM

Share

Telangana Politics: తెలంగాణ పాలిటిక్స్‌లో మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారారు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఒక చోట ఉండి, మరొకరితో కాపురం చేయవద్దంటూ సంచలన కామెంట్స్‌ చేశారు. వివరాలు పరిశీలిస్తే.. ఖమ్మం జిల్లా పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే రాజకీయ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు. ఆయన ఏం చేసినా అది సంచలనంగానే ఉంటుంది. తాజాగా ఆయన చేసిన కామెంట్స్‌ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన కామెంట్స్‌ చేశారు. కొంత మంది రాజకీయ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా, పార్టీని నాశనం చేద్దామని చూసినా, మీరందరూ పార్టీ పరువు పోకుండా కాపాడారని అన్నారు తుమ్మల.

ఎమ్మెల్సీగా తాత మధుని గెలిపించినందు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు మాజీమంత్రి. ఒక చోట ఉండి, మరొకరితో కాపురం చేయవద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు తుమ్మల. తాను మంత్రిగా ఉన్నప్పుడు అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలో అశ్వారావుపేటను అభివృద్ధి చేశానని చెప్పారు తుమ్మల. ప్రతి గ్రామానికి లింక్ రోడ్‌లు వేశానన్నారు. రాజకీయాల్లో ఉన్నత వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావు.

Also read:

Maoist vs Police: మావోయిస్టులపై పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారా? ఆ హత్యకు, ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉందా?

Vangaveeti Radha: వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ.. ఇంటెలిజెన్స్‌ డీజీకి సీఎం ఆదేశం..

Viral Video: ఎలుగుబంటి తెలివితేటలకు నెటిజన్లు ఫిదా.. రోడ్ సేఫ్టీపై వైరల్ వీడియో..