AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vangaveeti Radha: వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ.. ఇంటెలిజెన్స్‌ డీజీకి సీఎం ఆదేశం..

తనపై రెక్కీ నిర్వహించారన్న వంగవీటి రాధా వ్యాఖ్యలపై సీఎం జగన్‌ విచారణకు ఆదేశించారు. ఈ అంశాన్ని మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేసి రిపోర్టు..

Vangaveeti Radha: వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ.. ఇంటెలిజెన్స్‌ డీజీకి సీఎం ఆదేశం..
Vangaveeti Radha
Sanjay Kasula
|

Updated on: Dec 27, 2021 | 10:33 PM

Share

తనపై రెక్కీ నిర్వహించారన్న వంగవీటి రాధా వ్యాఖ్యలపై సీఎం జగన్‌ విచారణకు ఆదేశించారు. ఈ అంశాన్ని మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలని ఆయన వెంటనే ఇంటెలిజెన్స్‌ డీజీని ఆదేశించారు. మరోవైపు రాధాకు వెంటనే 2+2 సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు కొడాలి నాని.

తన హత్యకు రెక్కీ నిర్వహించారని రాధా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు బెజవాడ పోలీసులు. ఎవరెన్ని కుట్రలు చేసినా దేనికీ భయపడనని.. ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు రాధా. వంగవీటి రంగా ఆశయాల సాధనే తన లక్ష్యమన్నారు. అంతేకాదు తనపై రెక్కీ నిర్వహించిన వారి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు.. ఈ కామెంట్స్‌ ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి: Teachers Protest: జూనియర్లకు పట్టం కడతారా.. ఆ జీవోను రద్దు చేయాల్సిందే.. రోడ్డెక్కిన ఉపాధ్యాయులు..

Year Ender 2021: మార్కెట్ల దూకుడు.. పెట్రో పరుగు.. భారతీయ యువతలో బిజినెస్ మూడ్.. ఈ ఏడాది ఇవే టాప్!