చలికాలంలో స్వెటర్ ధరించి నిద్రపోతున్నారా..! శరీరంలో జరిగే ఈ మార్పులు తెలుసుకోండి..
Sweater Dangers:చలికాలంలో వెచ్చగా ఉండటానికి అందరు స్వెటర్లు ధరిస్తారు. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. చల్లటి గాలుల నుంచి శరీరాన్ని
Sweater Dangers:చలికాలంలో వెచ్చగా ఉండటానికి అందరు స్వెటర్లు ధరిస్తారు. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. చల్లటి గాలుల నుంచి శరీరాన్ని కాపాడుతాయి. శీతల ప్రాంతాల్లో వీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఉన్ని దుస్తులు లేకుంటే అక్కడ జీవించలేరు. అయితే వీటి వల్ల కూడా శరీరానికి హాని కలుగుతుంది. రాత్రిపూట పడుకునేముందు స్వెటర్ వేసుకొని ఎప్పుడు పడుకోకూడదు. శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ఇవి చికాకు కలిగించే విధంగా ఉంటాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
1. బీపీ తగ్గుతుంది రాత్రిపూట స్వెటర్ ధరించి నిద్రపోవడం వల్ల బీపీ తగ్గుతుంది. దీని వల్ల ఆకస్మికంగా చెమట పట్టే సమస్య రావచ్చు. నిద్రపోయేటప్పుడు ఉన్ని దుస్తులు ఎప్పుడు ధరించవద్దు. మీకు చాలా చలిగా అనిపిస్తే ఏదైనా మందంపాటి నూలు దుస్తులను ధరిస్తే మంచిది.
2. ఈ సమస్య పెరుగుతుంది ఉన్ని దుస్తుల్లో వాడే పీచు చిక్కగా ఉండడం వల్ల శరీరంలోని వేడి బయటకు రాదు కాబట్టి రాత్రిపూట స్వెటర్లు వేసుకుని నిద్రపోకూడదు. మీకు ఇప్పటికే మధుమేహం లేదా అధిక రక్తపోటు సమస్య ఉంటే అది మీకు మరింత హాని కలిగిస్తుంది.
3. చర్మంపై దద్దుర్ల సమస్య రాత్రిపూట స్వెటర్ ధరించి నిద్రపోవడం వల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. స్వెటర్ మందంగా ఉండి చర్మాన్ని పొడిబారిస్తుంది. దీనివల్ల శరీరంపై దద్దుర్లు వస్తాయి. చాలా మందికి ఉన్ని దుస్తుల అలర్జీ ఉంటుంది. వేడి దుస్తులు ఎప్పుడైనా చర్మాన్ని పొడిగా మార్చుతాయి.
4.శ్వాసకోశ సమస్యలు పెరగవచ్చు వెచ్చని దుస్తులు ఆక్సిజన్‌ను అడ్డుకుంటాయి. ఇది మిమ్మల్ని భయాందోళనకు గురి చేస్తుంది. మీకు శ్వాస సమస్య ఉంటే స్వెటర్ ధరించకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు వైద్యుడి సలహా తప్పనిసరని గుర్తుంచుకోండి.