Joint Pain Relief Tips: కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా? ఈ హోమ్ రెమెడీస్ ప్రయత్నించి ఉపశమనం పొందండి..

Joint Pain Relief Tips: శీతాకాలంలో ప్రజలు కీళ్ల నొప్పులతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ కాలంలో అన్ని వయసుల వారు ఆర్థరైటిస్, కీళ్ల సమస్యలతో బాధపడుతుంటారు.

Joint Pain Relief Tips: కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా? ఈ హోమ్ రెమెడీస్ ప్రయత్నించి ఉపశమనం పొందండి..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 28, 2021 | 12:00 AM

Joint Pain Relief Tips: శీతాకాలంలో ప్రజలు కీళ్ల నొప్పులతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ కాలంలో అన్ని వయసుల వారు ఆర్థరైటిస్, కీళ్ల సమస్యలతో బాధపడుతుంటారు. అంతేకాదు.. ఈ సమయంలో దీర్ఘకాలిక గాయాలు, కీళ్ల నొప్పులు విపరీతంగా పెరుగుతాయి. అయితే, ఈ కీళ్ల నొప్పుల నుంచి బయటపడేందుకు అద్భుతమైన ఇంటి నివారణలు ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. వాటిని ప్రయత్నించడం ద్వారా ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చట.

కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఇంటి నివారణలు.. 1. వేడి, చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వాపు ఎక్కువగా ఉన్నట్లయితే ఐస్ ముక్కను ఆ ప్రాంతంలో పెట్టి మర్ధన మాదిరిగా చేస్తే ప్రయోజనం ఉంటుంది. 2. అల్లంలో నొప్పి, వాపు తగ్గించే లక్షణాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులకు అల్లం నూనెను కూడా ఉపయోగించవచ్చు. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా ఆ నూనెతో మసాజ్ చేయవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. కీళ్ల నొప్పులకు అల్లం నూనె చాలా మేలు చేస్తుంది. ఇది ప్రభావిత ప్రాంతంలో నొప్పిని తగ్గిస్తుంది. 3. దీర్ఘకాలిక గాయాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి పసుపు అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే కర్కుమిన్ మూలకం కీళ్ల వాపును తగ్గిస్తుంది. ఒక టీస్పూన్ పసుపులో అర టీస్పూన్ అల్లం కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక కప్పు నీటిలో 10 నుండి 15 నిమిషాలు ఉడకబెట్టండి. దీన్ని రోజుకు రెండు మూడు సార్లు కీళ్లపై రాయండి. ఇది కీళ్ల నొప్పులు, వాపును తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. అల్లం, పసుపును ఒక గ్లాసు నీటిలో 12-15 నిమిషాలు మరగబెట్టి.. ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని తాగే మంచి ఫలితం ఉంటుంది. 4. దీర్ఘకాలిక గాయాలు, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి నిమ్మకాయ, ఉసిరి, బొప్పాయిని కూడా ఉపయోగించవచ్చు. వీటన్నింటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. 5. కీళ్ల నొప్పుల నివారణకు బ్రొకోలీ కూడా అద్భుతంగా పని చేస్తుంది. పిండితో చేసిన వస్తువులను తినడం తగ్గించాలి. అలాగే, చక్కెర, స్వీట్లు, చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. 6. రాతి ఉప్పులో మెగ్నీషియం, సల్ఫేట్ ఉన్నాయి. ఈ రెండూ శక్తివంతమైన నొప్పి నివారణ ఏజెంట్లు. ఇది వాపును తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. మీరు స్నానం చేసే నీటిలో ఒక టీస్పూన్ రాక్ సాల్ట్‌ను కలిపవచ్చు. నొప్పి, వాపు ప్రాంతాల్లో ఆ నీటిని పోస్తే ఫలితం ఉంటుంది. 7. ఈ నేచురల్ హోం రెమెడీస్ మాత్రమే కాకుండా, వ్యాయామం కూడా వీటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నొప్పి చాలా కాలం పాటు అలాగే ఉన్నట్లయితే.. వైద్యుడిని సంప్రదించాలి.

Also read:

Maoist vs Police: మావోయిస్టులపై పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారా? ఆ హత్యకు, ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉందా?

Vangaveeti Radha: వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ.. ఇంటెలిజెన్స్‌ డీజీకి సీఎం ఆదేశం..

Viral Video: ఎలుగుబంటి తెలివితేటలకు నెటిజన్లు ఫిదా.. రోడ్ సేఫ్టీపై వైరల్ వీడియో..