Sweet Porridge: అల్పాహారంలో ఇది చేర్చండి.. ఇక రోజంతా ఫుల్ యాక్టివ్.. ఒంట్లో కొవ్వు కూడా పరార్..!

Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వాటిలో తియ్యని గంజి కూడా చాలా కీలకమైనా పాత్ర పోషిస్తుంది. ఇది తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Sweet Porridge: అల్పాహారంలో ఇది చేర్చండి.. ఇక రోజంతా ఫుల్ యాక్టివ్.. ఒంట్లో కొవ్వు కూడా పరార్..!
Sweet Porridge
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Dec 28, 2021 | 7:15 AM

Sweet Porridge: ఓట్ మీల్‌ని రోజులో మొదటి భోజనంగా ఎంచుకోవడం చాలా మంచి విషయం. మీరు విద్యార్థి అయినా లేదా ఎక్కవసేపు కూర్చునే ఉద్యోగంలో ఉన్నా, ఏ పరిస్థితిలోనైనా, మీరు చింతించకుండా అల్పాహారంగా తీపి గంజిని తీసుకోవచ్చు. తీపి గంజి చేయడానికి పాలు, చక్కెర, డ్రై ఫ్రూట్‌లను ఉపయోగిస్తారు. అలాగే, ఓట్ మీల్ అనేది పోషకాలకు నిధి లాంటిది. అటువంటి పరిస్థితిలో, మీ ఆరోగ్యానికి తీపి గంజి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తీపి గంజి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు- తీపి గంజి చేయడానికి పాలు, గింజలు, చక్కెరను ఉపయోగిస్తారు. అందువల్ల ఇది పౌష్టికాహారంగా పనిచేస్తుంది. డ్రై ఫ్రూట్స్ మీ శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు మెదడును యాక్టివ్‌గా ఉంచుతుంది. అందుకే అల్పాహారంలో ఖచ్చితంగా తీపి గంజిని తీసుకోవాలి.

డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా మీ శరీరం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను పొందుతుంది. దీంతో మీ శరీరం అంతర్గతంగా బలంగా తయారవుతుంది. అదే సమయంలో, ఇది మీ శరీరంలోని కణాలకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి పనిచేస్తుంది.

మరోవైపు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా ఉండేందుకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్‌లు మీ మెదడు అలసిపోయేలా చేయవు.

తీపి రుచికరమైనది అయినప్పటికీ, గంజి మీ శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి నిరోధిస్తుంది. కాబట్టి తీపి గంజి మీ శరీరానికి ఎలాంటి హనీ చేయదు. గంజి తయారుచేసేటప్పుడు పాలు ఎక్కువగా, చక్కెర తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో చక్కెర శాతం తగ్గుతుంది. ఈ అల్పాహారం ఎల్లప్పుడూ మీ మెదడు, గుండె రెండింటికి పుష్కలంగా శక్తినిచ్చే విధంగా ఉండాలి. ఈ సందర్భంలో, మీరు తీపి గంజిని హాయిగా తినవచ్చు.

Also Read: Health Tips: పండ్లు తినే సమయంలో ఈ తప్పులు చేయకండి.. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు రావొచ్చు..

Sore Throat Issue: టాన్సిల్స్ సమస్యతో సతమతం అవుతున్నారా?.. హోమ్ రెమిడీస్‌తో ఇలా సులభంగా చెక్ పెట్టండి..