AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Juice vs Soup: బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది తీసుకోవాలి.. రసం లేదా సూప్‌లలో ఏది మంచిది?

Health Tips: బ్రేక్‌ఫాస్ట్‌లో జ్యూస్ మాత్రమే తీసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అయితే అల్పాహారంలో జ్యూస్ లేదా సూప్ ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Juice vs Soup: బ్రేక్‌ఫాస్ట్‌లో  ఏది తీసుకోవాలి.. రసం లేదా సూప్‌లలో ఏది మంచిది?
Juice Vs Soup
Venkata Chari
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 28, 2021 | 7:15 AM

Share

Juice vs Soup: ఇది లంచ్ లేదా డిన్నర్‌కు ముందు స్టార్టర్‌గా మాత్రమే తీసుకునే సూప్ లాంటిది కాదు. అనేక రుచులు, పోషకాలతో కూడిన సూప్‌లు ఎన్నో ఉన్నాయి. దీని కోసం మీరు ప్రతిరోజూ ఇలాంటి సూప్‌లను తీసుకోవచ్చు. అల్పాహారంలో రసం లేదా సూప్ తీసుకోవడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఇందులో ఏది ఉపయోగకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువ పోషకాలు ఎందులో ఉన్నాయి.. 1. రసం లేదా సూప్ రెండూ పోషకాలతో నిండి ఉన్నాయి. అయితే ఇవి రెండూ ఆర్గానిక్‌గా తయారైనవా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

2. జ్యూస్ అల్పాహారం లేదా సూప్‌కి మంచిదా అని తెలుసుకోవడానికి, మీరు రోజంతా మీ అవసరాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీరు శాండ్‌విచ్, పరాటా, పోహా లేదా ఉప్మా వంటి ఏదైనా ఘనమైన బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే, మీరు వాటితోపాటు జ్యూస్‌‌ని తీసుకోవచ్చు.

3. సూప్ తీసుకోవడం చాలా మించింది. ఇది మిమ్మల్ని శక్తివంతంగా తయారు చేస్తుంది. అయితే సూప్‌ జీర్ణం అయ్యాక, మీరు చాలా ఆకలితో ఉన్నారని అర్థం.

4. మీరు జ్యూస్ లేదా సూప్ నుంచి ఏదైనా ఒకటి ఎంచుకోవాలనుకుంటే, మీరు ఫైబర్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని సూప్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

5. మీరు పగటిపూట త్వరగా అలసటకు గురవుతుంటుంటారా? అయితే ఇలాంటి పరిస్థితిలో రసం మీకు చాలా మంచిది. ఎందుకంటే అది మీ మానసిక స్థితిని చల్లబరుస్తుంది. అలాగే ప్రశాంతంగా ఉంచుతుంది.

అయితే పగలు సుదీర్ఘంగా పని చేయడం వల్ల రాత్రి త్వరగా అలసిపోతారు. దీని నుంచి బయటపడటానికి సూప్ ఉత్తమ ఎంపికగా పనిచేస్తుంది.

Also Read: Health Tips: పండ్లు తినే సమయంలో ఈ తప్పులు చేయకండి.. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు రావొచ్చు..

Pregnancy Diet: ప్రెగ్నెన్సీ సమయంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే.. తీసుకోకూడనివి..

Hair Loss: జుట్టు ఎందుకు రాలుతుంది.? బట్టతల ఎందుకు వస్తుంది.. జుట్టు బలంగా ఉండేందుకు చిట్కాలు..!