Hair Loss: జుట్టు ఎందుకు రాలుతుంది.? బట్టతల ఎందుకు వస్తుంది.. జుట్టు బలంగా ఉండేందుకు చిట్కాలు..!

Hair Loss: ప్రస్తుతం ఎంతో మందిని వేధిస్తున్న సమస్య జట్టు రాలడం. కాలుష్యం, టెన్షన్, ఇతర కారణాల వల్ల చాలా మందికి జుట్టు రాలిపోతుంటుంది. కొందరికి జుట్టు తెల్లబడటం..

Hair Loss: జుట్టు ఎందుకు రాలుతుంది.? బట్టతల ఎందుకు వస్తుంది.. జుట్టు బలంగా ఉండేందుకు చిట్కాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 27, 2021 | 3:09 PM

Hair Loss: ప్రస్తుతం ఎంతో మందిని వేధిస్తున్న సమస్య జట్టు రాలడం. కాలుష్యం, టెన్షన్, ఇతర కారణాల వల్ల చాలా మందికి జుట్టు రాలిపోతుంటుంది. కొందరికి జుట్టు తెల్లబడటం బాధిస్తుంటుంది. ముఖ్యంగా చిన్నవయసులోనే బట్టతల రావడం మానసికంగా మరింతగా కుంగదీస్తోంది. దీంతో చాలా మంది జట్టును రాలకుండా ఉండేందుకు, తెల్లబడకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఫలితం ఉండదు. మరి జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

జట్టు ఎందుకు ఊడిపోతుంటుంది..? మానవ జన్యువుల్లో బాల్డ్‌నెస్‌ జీన్స్‌ ఆండ్రొజెనిటిక్‌ అలోపిసియా కారణంగా బట్టతల వస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. మనం ఎదుర్కొనే ఒత్తిళ్లు, పోషకాహార లోపం కారణంగా కూడా వెంట్రుకలు రాలిపోయి బట్టతల వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక మహిళల్లో మెనోపాజ్‌, గర్భధారణం తదితర సమయాలలో హర్మోన్ల విడుదలలో వచ్చే మార్పుల వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక పురుషుల్లో, మహిళల్లో గుండె వ్యాధులు, డయాబెటిస్‌, బీపీ, అర్థరైటిస్‌ వంటి వ్యాధులతో బాధపడేవారు మందులు వాడటం వల్ల జుట్టు ఊడిపోతుంటుంది.

జుట్టు రాలడం ఆపాలంటే.. వాస్తవానికి బట్టతలను అడ్డుకోవడం అనేది కొంత కష్టమైన పనే. అయితే బట్టతల రావడానికి కొంత జాప్యం చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జన్యు సంబంధిత, ఇతర కారణాలతో వచ్చే బట్టతలను పూర్తిగా ఆపలేకున్నా.. కొన్ని సంవత్సరాల పాటు బట్టతల రాకుండా చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

పోషకాహారం లోపం.. పోషకాహారం లోపం వల్ల కూడా జట్టు ఊడిపోతుంటుంది. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం మంచిదంటున్నారు. తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్‌ ఎక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అలాగే తగినంత వ్యాయామం, సరైన నిద్ర ఎంతో అవసరమంటున్నారు. బయటకు వెళ్లినప్పుడు పొల్యూషన్‌లో తిరిగినప్పుడు తలను స్కార్ఫ్ లేదా క్యాప్‌తో కవర్‌ చేయడం మంచిది. దీని వల్ల జుట్టు ఊడిపోయే సమస్యను తగ్గించుకోవచ్చు. తలపై పేరుకుపోయిన ధుమ్ము వల్ల చుండ్రు ఏర్పడుతుంది. దీంతో ఎప్పటికప్పుడు రోజువారీగా షాంపూతో తలను శుభ్రం చేసుకోవడం మంచిది. మగవారు అయితే రోజు విడిచి రోజు, మమిళలు అయితే వారానికి కనీసం రెండు, మూడు సార్లు తలస్నానం చేయడం మంచిదంటున్నారు నిపుణులు. కొందరు తల దువ్వుకునే క్రమంలో చిక్కుళ్లు పడిన వెంట్రుకలను దువ్వెనతో బలంగా దువ్వుతుంటారు. అలా బలంగా దువ్వడం వల్ల కుదుళ్లు బలహీనంగా మారి జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అలాగే కొందరు తలకు నూనె పెట్టుకునేందుకు ఇష్టపడరు. జిడ్డుగా మారుతుందని అనుకుంటారు. కానీ స్నానం చేసే ముందు తలకు నూనె పెట్టుకోవడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. జుట్టు రాలడం, బట్టతల రావడం సమస్యను అధిగమించవచ్చు అని అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి:

Covid Vaccine: 15-18 ఏళ్ల టీనేజర్లకు గుడ్‌న్యూస్.. కోవిన్‌‌లో రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే..?

Cholesterol Food: మీ శరీరంలో కలెస్ట్రాల్‌ పెరిగిపోతోందా..? ప్రమాదమే..!

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట