AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఈ భారత బ్యాటర్‌కు పూనకాలే.. పరుగుల వర్షం కురిపించడంలో ఫస్ట్ ప్లేస్..!

Ajinkya Rahane: అజింక్య రహానే బాక్సింగ్ డేలో ఆడిన 5 టెస్ట్ మ్యాచ్‌లలో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు సాధించాడు.

IND vs SA: బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఈ భారత బ్యాటర్‌కు పూనకాలే.. పరుగుల  వర్షం కురిపించడంలో ఫస్ట్ ప్లేస్..!
Ajinkya Rahane
Venkata Chari
| Edited By: |

Updated on: Dec 28, 2021 | 7:15 AM

Share

Ajinkya Rahane Boxing Day Test Records: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే 40 పరుగులతో అజేయంగా ఆడుతున్నాడు. బాక్సింగ్ డే రోజున ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌ల్లో రహానే రికార్డులు అద్భుతంగా ఉంటున్నాయి. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 9 ఇన్నింగ్స్‌ల్లో 40కి పైగా సగటుతో పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

భారత్-దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ రెండో రోజు వర్షం కారణంగా జరగలేదు. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఈ సమయంలో లోకేశ్ రాహుల్ 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అదే సమయంలో రహానే కూడా 81 బంతుల్లో అజేయంగా 40 పరుగులు చేశాడు. ఈ స్కోరుతో పాటు ఈ బాక్సింగ్ డే మ్యాచ్ కూడా అతనికి విజయవంతమైంది.

నిజానికి ఇప్పటి వరకు ఆడిన 5 బాక్సింగ్ డే మ్యాచ్‌ల్లో 9 ఇన్నింగ్స్‌ల్లో రహానే భారీ స్కోర్లు చేశాడు. 2020 సంవత్సరంలో, అతను డిసెంబర్ 26న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 112 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు 2013లో దక్షిణాఫ్రికాపై ఒక ఇన్నింగ్స్‌లో 51 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ డర్బన్‌లో జరిగింది. ఈ విధంగా, బాక్సింగ్ డే రోజున ప్రారంభమైన మ్యాచులో రహానె స్కోర్లను ఓసారి చూస్తే.. 51*, 96, 147, 48, 34, 1, 112, 27*, 40*గా ఉన్నాయి.

అజింక్య రహానే ఇప్పటి వరకు 79 మ్యాచ్‌లు ఆడి 134 ఇన్నింగ్స్‌లలో 4795 పరుగులు సాధించాడు. ఈ సమయంలో అతను 12 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు సాధించాడు. రహానే అత్యుత్తమ టెస్టు స్కోరు 188 పరుగులుగా ఉంది. ఈ అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ 90 వన్డేల్లో 2962 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 3 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. వన్డేల్లో అతని అత్యుత్తమ స్కోరు 111 పరుగులుగా నిలిచింది. ఇవి కాకుండా రహానే 20 టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో 375 పరుగులు సాధించాడు.

Also Read: Cricket News: వారెవ్వా.. సూపర్‌ సిక్స్‌.. షాట్‌ చూసిన ప్రేక్షకులు, వ్యాఖ్యాతలు ఫిదా అయ్యారు..

Rohit Sharma: రోహిత్‌ వన్డే సిరీస్‌కి కూడా దూరమేనా..! అప్పుడు వన్డే కెప్టెన్ ఎవరు..?