Different Theft: వెరైటీ దొంగలు, అవి మాత్రమే చోరీ..! తెలిస్తే అవాక్కే..! వైరల్ అవుతున్న వీడియో

Different Theft: వెరైటీ దొంగలు, అవి మాత్రమే చోరీ..! తెలిస్తే అవాక్కే..! వైరల్ అవుతున్న వీడియో

Anil kumar poka

|

Updated on: Dec 29, 2021 | 2:36 PM

దొంగతనం జరిగింది.. అనగానే అందరూ డబ్బు, నగలు, విలువైన వస్తువులు పోయుంటాయని అంతా అనుకుంటారు..కానీ, కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సత్రం సెంటర్‌లో మాత్రం వింత దొంగలు వెరైటీ చోరీకి పాల్పడ్డారు.


దొంగతనం జరిగింది.. అనగానే అందరూ డబ్బు, నగలు, విలువైన వస్తువులు పోయుంటాయని అంతా అనుకుంటారు..కానీ, కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సత్రం సెంటర్‌లో మాత్రం వింత దొంగలు వెరైటీ చోరీకి పాల్పడ్డారు. అర్ధ రాత్రి కూరగాయల దూరిన దొంగలు.. షాపులో ఉన్న టమాటాల ట్రేలు ఎత్తుకెళ్లారు..మిగిలిన కూరగాయలు ఏవీ ముట్టుకోకుండా..కేవలం టమాటా ట్రేలు మాత్రం ఎత్తుకెళ్లారు. రోజు మాదిరిగానే వ్యాపారి ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు కూరగాయలు మార్కెట్లో వ్యాపారం చేసుకొని.. అనంతరం షాపు మూసివేసి ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా దొంగలు..అర్ధరాత్రి వేళ టమాటాల ట్రేలను మాయం చేశారు. ఒక్కో ట్రే రెండు వేల రూపాయల వరకు ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. దాదాపు ఆరువేల రూపాయల విలువగల టమాటాలు మాయమవటంతో వ్యాపారి లబోదిబోమంటున్నారు. నెల రోజులు కష్టపడి కూరగాయలు అమ్ముకున్నా ఆ డబ్బులు రావంటున్నారు. జరిగిన దొంగతనంపై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

Published on: Dec 28, 2021 07:42 PM