Rajinikanth: మరోసారి మంచి మనసు చాటుకున్న రజనీకాంత్.. పేద విద్యార్థుల కోసం..
తనకు మాత్రమే సాధ్యమయ్యే స్టైల్ అండ్ మేనరిజమ్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. సినిమాల సంగతి పక్కన పెడితే
తనకు మాత్రమే సాధ్యమయ్యే స్టైల్ అండ్ మేనరిజమ్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. సినిమాల సంగతి పక్కన పెడితే సూపర్‌స్టార్ హోదాలోనూ ఆయన ఎంతో సింప్లిసిటీగా ఉంటారు. ఆయనకు సామాజిక దృక్పథం కూడా ఎక్కువే. అవసరమైన వారికి తనదైన సహాయ సహకారాలు అందిస్తుంటారు. తన ఫౌండేషన్ సహాయంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. కాగా తన ఫౌండేషన్ అధ్వర్యంలో మరికొన్ని మంచి పనులకు శ్రీకారం చుట్టారు రజనీకాంత్. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం పలు సహాయ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు.
‘ద రజనీకాంత్ ఫౌండేషన్’ ద్వారా పేద విద్యార్థులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్‌పీఎస్‌సీ) నిర్వహించే పలు పోటీ పరీక్షలకు సంబంధించి 100 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నాం. ఇందులో భాగంగా ‘సూపర్ 100బ్యాచ్’ పేరుతో రిజిస్ట్రేషన్లు ప్రారంభించాం. సామాజిక అసమానతలను రూపుమాపడానికి రజనీకాంత్ ఫౌండేషన్ విశేషంగా కృషి చేస్తోంది. ఫౌండేషన్ కార్యకలాపాలపై గ్లోబల్‌గా మా విజన్ ఉన్నప్పటికీ ప్రస్తుతం తమిళనాడుకు మాత్రమే మా సేవలు పరిమితం చేస్తున్నాం. తమిళనాడు ప్రజల కారణంగానే రజనీకాంత్‌కు పేరు ప్రతిష్ఠలు లభించాయి. అందువల్ల ఫౌండేషన్ అందించే ఏ సహాయం అయినా తమిళనాడు నుంచే ప్రారంభమవుతుంది’ అని ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘అన్నాత్తై( తెలుగులో పెద్దన్న)’ సినిమాతో మరోసారి మెప్పించారు రజనీకాంత్. దీపావళికి విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది.
Superstar #Rajinikanth‘s foundation website launched.
An awesome initiative to provide FREE tnpsc group exam training for super 100 batch. pic.twitter.com/xYFKZL6Aaa
— Manobala Vijayabalan (@ManobalaV) December 27, 2021
Also Read:
Kurnool: పుల్లారెడ్డి మిఠాయిల దుకాణంలో చోరీ.. నగదుతో పాటు స్వీట్స్ కూడా అపహరించుకెళ్లిన దొంగ..
Ram Charan: సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్.. తెగ సంబరపడిపోయిన సామ్..
Viral Video: నిప్పులు చిమ్మే ఫైర్ ఫ్రూట్ దోసె.. ఎక్కడ దొరుకుతుందంటే..