Genelia & Salman Khan: సల్మాన్‌తో జెనిలియా తీన్మార్ డ్యాన్స్.. స్టెప్స్ అదిరిపోయాయంటున్న నెటిజన్స్..
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ జెనీలియా. బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా తెలుగు ప్రేక్షకులకు
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ జెనీలియా. బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది జెనీలియా. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు జెనీలియా. కెరీర్ మంచి పిక్స్‌లో ఉన్న సమయంలో బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. పెళ్లైన తర్వాత జెనీలియా సినిమాలకు దూరంగా ఉంటోంది. వెండితెరపై ఈ అమ్మడు కనిపించకపోయినా.. బాలీవుడ్ బుల్లితెరపై, సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్.. ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది జెనీలియా.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా హీరోయిన్ జెనీలియా అతనికి శుభాకాంక్షలు తెలిపారు. బర్త్ డే విషెస్ తెలియజేస్తూ సల్మాన్‌తో తను తీన్మార్ డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో సల్మాన్ ఖాన్, జెనీలియా కలిసి ఫుల్ జోష్ మీద ఎనర్జిటిక్ డ్యాన్స్ చేశారు. చివరకు సల్మాన్ అలసిపోయి ఆగిపోవడంతో జెనీలియా కూడా తన డ్యాన్స్ ఆపేసింది. ఈ వీడియోను జెనీలియా తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ సల్లూభాయ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ” పెద్ద మనసున్న వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు.. దేవుడు మిమ్మల్ని సంతోషం, ప్రేమ, మంచి ఆరోగ్యంగా ఉండేలా ఆశీర్వదిస్తాడు. మేము నిన్ను ప్రేమిస్తున్నాము.. ఆజ్ భాయ్ కా పుట్టినరోజు హై” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
View this post on Instagram
Singer Mangli: మంగ్లీకి సెల్పీల సెగ.. ఎగబడిన జనం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్…