Ram Charan: సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్.. తెగ సంబరపడిపోయిన సామ్..
Samantha: నాగ చైతన్యతో విడిపోయిన అనంతరం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు గురైంది సమంత. కొందరు నెటిజన్లు ఆమెను లక్ష్యంగా చేసుకుంటూ నెగెటివ్ కామెంట్లు, వ్యాఖ్యలు పోస్ట్
Samantha: నాగ చైతన్యతో విడిపోయిన అనంతరం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు గురైంది సమంత. కొందరు నెటిజన్లు ఆమెను లక్ష్యంగా చేసుకుంటూ నెగెటివ్ కామెంట్లు, వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. వీటిని భరించలేక న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది సామ్. ఇక విడాకుల వ్యవహారం సమంత సినిమా కెరీర్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని చాలామంది భావించారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోంది సమంత. టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు హాలీవుడ్ ప్రాజెక్టులకు కూడా ఓకే చెబుతోంది. ఇక బన్నీ ‘పుష్ప’ సినిమాలో ఆమె నటించిన స్పెషల్ సాంగ్‌కు వస్తున్న స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా సమంత గురించి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకోసం రాజమౌళి, తారక్‌తో పాటు వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు చరణ్. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో సామ్ గురించి మూడు ముక్కల్లో చెప్పమని అడగ్గా ‘ కమ్ బ్యాక్.. బిగ్గర్.. స్ట్రాంగర్..’ అని ప్రశంసలు కురిపించాడు. చరణ్ మాటలు విన్న సామ్ కూడా సంబరపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను మూడు లవ్ సింబల్స్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా వీరిద్దరు ‘రంగ స్థలం’ లో జంటగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తో పాటు ‘ఆచార్య’ సినిమాలోనూ నటిస్తున్నాడు రామ్‌చరణ్. అదేవిధంగా శంకర్, గౌతమ్ తిన్ననూరి సినిమాలను కూడా లైన్‌లో పెట్టాడు. ఇక సమంత ‘శాకుంతలం’, ‘యశోద’ సినిమాల్లో నటిస్తోంది. ఓ హాలీవుడ్ సినిమాతో పాటు వెబ్ సిరీస్‌కు కూడా సైన్ చేసింది.
♥️♥️♥️ https://t.co/IqHN3aQ8Jw
— Samantha (@Samanthaprabhu2) December 27, 2021
Also Read:
Sourav Ganguly: సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చికిత్స..
Viral Video: నిప్పులు చిమ్మే ఫైర్ ఫ్రూట్ దోసె.. ఎక్కడ దొరుకుతుందంటే..
Mohit Sharma: తండ్రిగా ప్రమోషన్ పొందిన టీమిండియా క్రికెటర్.. బుజ్జాయి పుట్టాడంటూ భావోద్వేగం..