AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీకి అరుదైన గౌరవం.. మూగజీవాలపై ప్రేమకు గుర్తుగా..

అందం, అభినయంతోనే కాదు తన మంచి మనసుతోనూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది బాలీవుడ్‌ నటి అలియాభట్‌. మూగజీవాలపై అమితప్రేమ చూపే ఈ ముద్దుగుమ్మ పూర్తి శాకాహారి

Alia bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీకి అరుదైన గౌరవం.. మూగజీవాలపై ప్రేమకు గుర్తుగా..
Basha Shek
|

Updated on: Dec 29, 2021 | 7:29 AM

Share

అందం, అభినయంతోనే కాదు తన మంచి మనసుతోనూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది బాలీవుడ్‌ నటి అలియాభట్‌. మూగజీవాలపై అమితప్రేమ చూపే ఈ ముద్దుగుమ్మ పూర్తి శాకాహారి. అంతేకాదు.. జంతువుల సంరక్షణ కోసం నిర్వహించే కార్యక్రమాలు, క్యాంపెయిన్లకు తన వంతు తోడ్పాటు అందిస్తోంది. ఇందులో భాగంగా ‘ఫూల్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టినందుకు గానూ 2021 సంవత్సరానికి గానూ ‘ పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA)’ ఇండియా ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా ఎంపికైంది. ‘ఫూల్‌’ సంస్థ ‘ఫ్లెదర్‌’ అనే ఓ ప్రత్యేకమైన లెదర్‌తో వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తోంది. అంటే దేవాలయాల్లో పూజల కోసం వాడే పూలను వృథాగా పడేయకుండా శాస్త్రీయ పద్ధతుల్లో ‘లెదర్‌’ను తయారుచేస్తారు. ఈ వేగన్‌ లెదర్‌తో ఎన్నో మూగజీవాలను కాపాడుతోన్న ‘ఫూల్‌’ కంపెనీలో పెట్టుబడులు పెట్టి తన వంతు తోడ్పాటు అందించింది అలియా. దీనికి గుర్తింపుగానే పెటా పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైందీ అందాల తార.

కాగా గతేడాది ఇదే పెటా ఇండియా ఫ్యాషన్‌ అవార్డును కూడా అందుకుందీ ఆర్‌ఆర్ఆర్‌ బ్యూటీ. మూగజీవాలు, ప్రకృతికి నష్టం కలిగించకుండా చిన్న పిల్లల బట్టలు రూపొందించే ‘వెగన్ కిడ్స్‌వెర్ లైన్’కు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఈ పురస్కారం గెల్చుకుందీ సొగసరి. అంతకుముందు 2017లో ‘కోఎక్సిస్ట్‌’ అనే పేరుతో జంతు సంక్షేమ వేదికను ప్రారంభించింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటోంది అలియా. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్నారు. ఒలివియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియాశరణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 7న ఈ పాన్‌ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘గంగూబాయి’ సినిమాలోనూ నటిస్తోంది.

Also Read:

Irfan Pathan: రెండోసారి తండ్రైన టీమిండియా మాజీ క్రికెటర్‌.. ముద్దుల కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే..

Cylinder Blast: సిలిండర్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు దుర్మరణం

Naga Chaitanya: నాగచైతన్య హుందాతనానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి.. వైరల్‌ అవుతోన్న అభిమాని పోస్ట్‌..