Cylinder Blast: సిలిండర్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు దుర్మరణం

బీహార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు అమాయక చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.

Cylinder Blast: సిలిండర్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు దుర్మరణం
Gas Cylinder Blast
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 29, 2021 | 6:57 AM

Bihar Gas Cylinder Blast: బీహార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు అమాయక చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. అయితే, మృతి చెందినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన బంకాలోని రాజౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజాభార్ ప్రాంతంలో జరిగింది.

బంకా బ్లాక్ ఏరియాలోని రాజావర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఓ ఇంట్లో సిలిండర్ పేలి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో ఓ బాలుడు, నలుగురు బాలికలు ఉన్నారు. వారిలో నలుగురు తోబుట్టువులు కాగా, ఒకరు బంధువు ఉన్నారు. జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు గ్రామానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

కూలి అశోక్ పాశ్వాన్ ఇంట్లో సాయంత్రం అతని భార్య సునీతాదేవి వంట చేసేందుకు కూర్చున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అతని కుమారుడు, ముగ్గురు కుమార్తెలు, అశోక్ సోదరుడు ప్రకాష్‌ కుమార్తె ఇంట్లో కూర్చోని చదువుతున్నారు. సునీతాదేవి గ్యాస్ స్టవ్ వెలిగించగానే పైపులో మంటలు చెలరేగాయి. దీంతో భయపడిన సునీత భర్తను పిలవడానికి బయటికి పరుగులు తీసింది. ఇంతలో సిలిండర్ పేలడంతో ఇంట్లోనే కూర్చున్న ఐదుగురు చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు. భర్తకు ఫోన్ చేసి సునీత తిరిగి వచ్చే సమయానికి చిన్నారులు మంటల్లో కాలిపోయి ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ప్రమాదంలో అశోక్ పాశ్వాన్ నలుగురు పిల్లలు మరణించారు. సోదరుడు ప్రకాష్‌ కూతురు కూడా చనిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రకాష్‌కు చెందిన ఒక కుమారుడు, ఒక కుమార్తె ఇంటి బయట ఉండడంతో వారిద్దరి ప్రాణాలు దక్కాయి. అన్నదమ్ములిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఉజ్వల పథకం కింద అతని ఇంటికి గ్యాస్ స్టవ్ వచ్చింది. సంఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు స్థానిక అధికారి మొయినుద్దీన్ తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయం అందజేస్తోందన్నారు. ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also… JNU: ‘లైగింక వేధింపులను నివారించాలంటే అమ్మాయిలు ఇలా చేయాలి’.. వివాదంగా మారిన జేఎన్‌యూ సర్క్యూలర్‌..