AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: నాగచైతన్య హుందాతనానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి.. వైరల్‌ అవుతోన్న అభిమాని పోస్ట్‌..

Naga Chaitanya: అక్కినేని నట వారసుడు నాగచైతన్య తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని టాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. పేరుకు సినిమా బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చినా తన నటనతో..

Naga Chaitanya: నాగచైతన్య హుందాతనానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి.. వైరల్‌ అవుతోన్న అభిమాని పోస్ట్‌..
Narender Vaitla
|

Updated on: Dec 29, 2021 | 6:58 AM

Share

Naga Chaitanya: అక్కినేని నట వారసుడు నాగచైతన్య తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని టాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. పేరుకు సినిమా బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చినా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక చైని అభిమానించే వారు కేవలం అతని నటననే కాకుండా తనలోని హుందాతనానికి కూడా ఫిదా అవుతుంటారు. ఎంతో సెలబ్రిటీ హోదా ఉన్నా నాగచైతన్య చాలా సింపుల్‌గా హుందా తనంతో ప్రవర్తిస్తుంటారు. సినిమా ఫంక్షన్స్‌లో ఈ అక్కినేని హీరో మాట్లాడే తీరే దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది. తాజాగా చైతన్య అభిమాని చేసిన ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ ఈ విషయాన్ని చెప్పకనే చెప్పింది.

ఇంతకీ విషయమేంటంటే.. ఇటీవల నాగచైతన్య హాలీడే కోసం గోవా వెళ్లారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న ఓ జంట చైని చూసి.. హీరోనేనా కాదా అని అనుమానించారు. అయితే తర్వాత నాగచైతన్యేనని కన్ఫామ్‌ చేసుకుని సెల్ఫీ అడిగారా జంట. దీంతో వారిలో ఒకరు సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే వారు తీస్తోన్న ఫోటోలో కపుల్స్‌ సరిగ్గా కనిపించకపోవడాన్ని గమనించిన చైతన్య.. వెంటనే ఫోన్‌ తీసుకొని నేను తీస్తాను, అప్పుడు మీరు బాగా కనిపిస్తారంటూ సెల్ఫీ తీసి ఆ జంటకు ఫోన్‌ ఇచ్చేశారు. దీంతో ఆ కపుల్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఈ విషయాన్ని అంతటినీ సదరు అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు. నవీన్‌ శర్మ అనే వ్యక్తి ఈ విషయానంతటినీ వివరంగా తెలుపుతూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ చేశాడు. ఈ ఫోటోతో పాటు చైతన్యపై ప్రశంసల వర్షం కురిపించారు. నిజంగా చైతన్య డౌన్‌ టు ఎర్త్‌ అని, ఆయన ప్రవర్తన చూస్తే ఆశ్చర్యమేసింది అంటూ రాసుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. చైతన్య సింప్లిసిటీకి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలంటూ ఆయన ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:  Vijay Devarakonda’s Liger : కథల్లోనే కాదు పూరీ టైటిల్స్‌లో కూడా పవర్ ఉంటుంది.. లైగర్ టైటిల్ వెనుక సీక్రెట్ ఇదే..

APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

Multibagger stocks: ఈ ఏడాది మల్టీ రిటర్న్స్ ఇచ్చిన ఆ స్టాక్స్.. అవి ఏమిటంటే..