AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda’s Liger : కథల్లోనే కాదు పూరీ టైటిల్స్‌లో కూడా పవర్ ఉంటుంది.. లైగర్ టైటిల్ వెనుక సీక్రెట్ ఇదే..

లైగర్.. పేరే కొత్తగా ఉంది కదా..  ఈ లైగర్ అనే పదాన్ని ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్..

Vijay Devarakonda's Liger : కథల్లోనే కాదు పూరీ టైటిల్స్‌లో కూడా పవర్ ఉంటుంది.. లైగర్ టైటిల్ వెనుక సీక్రెట్ ఇదే..
రౌడీ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ ఎర్లీగా స్టార్ట్ అయ్యాయి. వరుస అప్‌డేట్స్‌తో హల్‌చల్ చేస్తోంది లైగర్ టీమ్‌.
Rajeev Rayala
|

Updated on: Dec 28, 2021 | 9:49 PM

Share

Vijay Devarakonda’s Liger : లైగర్.. పేరే కొత్తగా ఉంది కదా..  ఈ లైగర్ అనే పదాన్ని ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్.. అసలు లైగర్ అంటే ఏంటంటే.. మగ సింహానికి.. ఆడ పులికి పుట్టిన దాన్నే లైగర్ అని అంటారు. సింహం, పులి రెండు బలమైన క్రూర మృగాలా కలయికలో పుట్టిన లైగర్.. ఆ రెండింటి బలాన్ని, పోలికలు కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇదే లైగర్ అనే టైటిల్‌తో, అంతే పవర్ ఫుల్ కథతో పూరీజగనాథ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు పూరీ. విజయ్‌కి యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ యాటిట్యూడ్‌కి.. బడీ లాంగ్వేజ్‌కు తెలుగుప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.. కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ లో ఈ రౌడీ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడి ముద్దుగుమ్మలు విజయ్‌తో సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అది మనోడి క్రేజ్..

ఇక విజయ్‌లాంటి హ్యాండ్సమ్ హీరోను తనదైన స్టైల్‌లో చూపించనున్నాడు పూరీ. పూరీజగన్నాథ్ సినిమాలంటే ప్రేక్షకుల్లో అంచనాలు మాములుగా ఉండవు.. మాస్ ఆడియన్స్ క్లాస్ ఆడియన్స్ అని తేడాలేకుండా పూరీ సినిమాకు ఫ్యాన్స్ ఉంటారు. పూరీజగన్నాథ్ తన సినిమాలతో హీరోల ఇమేజ్‌ను అమాంతం ఆకాశానికి చేర్చుతారు. అలాంటి పూరిజగన్నాథ్‌తో విజయ్ దేవరకొండ సినిమా అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఆ బజ్‌కు ఎక్కడ తగ్గకుండా సినిమా చేస్తున్నాడు ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్.. లైగర్ సినిమాతో పాన్ ఇండియా వైపు అడుగులువేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అంతే కాదు లైగర్ సినిమాతోనే బాలీవుడ్‌కు కూడా పరిచయం కానున్నాడు. ఇప్పటికే విజయ్ నటించిన సినిమాలు యూట్యూబ్‌లో హిందీలో డబ్ అయ్యి భారీ వ్యూస్‌ను దక్కించుకున్నాయి. ఆ రకంగా హిందీ ప్రేక్షకులకు పరిచయమైన ఈ కుర్రహీరో.. ఇప్పుడు లైగర్ సినిమాతో అక్కడి వారికి మరింత దగ్గర కానున్నాడు. అంతకు ముందు విజయ్ నటించిన అర్జున్ రెడ్డి సినిమా హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఇక బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా పై ఆసక్తి పెంచారు పూరీ.. ఇందుకోసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను రంగంలోకి దించారు. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్‌లోకి అనన్య తెలుగులోకి ఒకేసారి పరిచయం అవుతున్నారు. అలాగే బాలీవుడ్ బడా నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దాంతో ఈ సినిమాకు అక్కడ కావాల్సినంత మార్కెట్ లభించింది. ఇక ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించనున్నాడు విజయ్. ఇందుకోసం చాలా కష్టపడ్డాడు ఈ కుర్ర హీరో.. అలాగే ఈ సినిమాలో మరో హైలైట్ కూడా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఇండియ‌న్ సినిమాల్లో న‌టించ‌ని ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ లైగర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రకోసం టైసన్‌ను రంగంలోకి దింపారు పూరీ. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు పూరీ. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న లైగర్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకోసం అటు విజయ్ దేవర కొండ అభిమానులు.. ఇటు పూరిజగన్నాథ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాగే సినిమా తారలు కూడా కొందరు లైగర్ సినిమాకోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. ఇక ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. దాంతో ప్రమోషన్స్‌లోను లైగర్ టీమ్ స్పీడ్ పెంచింది. ఈ మేరకు 2021 కి అదిరిపోయే అప్డేట్స్‌తో గుడ్ బై చెప్పనున్నారు. బ్యాక్ టు బ్యాక్  అప్డేట్స్‌తో ఈ ఇయర్‌కు సెండాఫ్ ఇవ్వరున్నారు పూరీ అండ్ టీమ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood : సినిమా టికెట్ల అంశం పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అదేంటంటే..

Sai Pallavi: థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసా.. ఆ సన్నివేశాలప్పుడు భయమేసిందన్న సాయిపల్లవి..

Varun Sandesh : వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ మూవీ ట్రైలర్.. అందమైన ప్రేమకథే కాదు అంతకుమించి..

Follow Us