Varun Sandesh : వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ మూవీ ట్రైలర్.. అందమైన ప్రేమకథే కాదు అంతకుమించి..

Varun Sandesh : కుర్ర హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ఇందువదన అనే సినిమాతో  ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.హ్యాపీడేస్ సినిమా తర్వాత సోలో హీరోగా మారిన వరుణ్ హీరోగా పలు సినిమాల్లో నటించాడు

Varun Sandesh : వరుణ్ సందేశ్ 'ఇందువదన' మూవీ ట్రైలర్.. అందమైన ప్రేమకథే కాదు అంతకుమించి..
Varun Sandesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 28, 2021 | 4:40 PM

Varun Sandesh : కుర్రహీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ఇందువదన అనే సినిమాతో  ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హ్యాపీడేస్ సినిమా తర్వాత సోలో హీరోగా మారిన వరుణ్ హీరోగా పలు సినిమాల్లో నటించాడు. కానీ వరుణ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయాయి. ఇక కొంతకాలం తర్వాత ఇప్పుడు ఇందువదన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ యంగ్ హీరో. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎం శ్రీనివాసరాజు దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్ కు జోడీగా ఫర్నాజ్ శెట్టి ఇందులో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, టీజర్, పాటలకు అనూహ్యమైన స్పందన వస్తుంది. కంటెంట్ అంతా కళాత్మకంగా ఉంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు ఎమ్మెస్సార్.

తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఇందువదన. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమా యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో అందమైన ప్రేమ కథతోపాటు భయపెట్టే హారర్ సన్నివేశాలు కూడా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. రఘు బాబు – అలీ – నాగినీడు – సురేఖ వాణి – ధనరాజ్ – తాగుబోతు రమేష్ – మహేష్ విట్ట – పార్వతీషం నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పైన వరుణ్ సందేశ్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితే తిరిగి రాణించాలని చూస్తున్నాడు.  మరి ఈ సినిమాతో వరుణ్ సందేశ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood: సినిమా టికెట్ ధరలు ఇలా నిర్ణయించండి.. ఏపీ సర్కార్‌కు డిస్టిబ్యూటర్ల ప్రతిపాదన..

Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..

Allu Arjun: ఎమోషనల్ అయిన అల్లు అర్జున్.. బన్నీ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సుకుమార్..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో