Tollywood: సినిమా టికెట్ ధరలు ఇలా నిర్ణయించండి.. ఏపీ సర్కార్‌కు డిస్టిబ్యూటర్ల ప్రతిపాదన..

ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే..  సినిమా టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలి అంటుంది ఏపీ ప్రభుత్వం

Tollywood: సినిమా టికెట్ ధరలు ఇలా నిర్ణయించండి.. ఏపీ సర్కార్‌కు డిస్టిబ్యూటర్ల ప్రతిపాదన..
Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 28, 2021 | 3:36 PM

Tollywood : ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే..  సినిమా టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలి అంటుంది ఏపీ ప్రభుత్వం.. టికెట్ల ధరలు తగ్గిచడంతో నష్టం వాటిల్లుతుందని సినిమా పెద్దలు వాపోతున్నారు. గత కొద్దిరోజులుగా ఈ వ్యవహారం పై చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇటీవల హీరో నాని, సిద్దార్థ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నాని మాట్లాడుతూ.. కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్ అని మాట్లాడటం.. నానికి కౌంటర్ ఇచ్చిన మిస్టర్స్ పైన సిద్దార్థ్ సెటైర్లు వేయడం మనకు తెలిసిందే.. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి పేర్ని నానితో సినీ డిస్ట్రిబ్యూటర్ల భేటీ అయ్యారు.

ఈ భేటీలో సినిమా టికెట్ల రేట్లు పెంచాలన్నది డిస్ట్రిబ్యూటర్ల ప్రతిపాదన. వాళ్లు ఎక్కడ, ఎంత పెంచాలని కోరెంటే.. కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో అత్యధికంగా రూ.150, అలాగే లోయర్‌ క్లాస్‌లో రూ. 50లు ఉండాలని డిస్ట్రిబ్యూటర్లు కోరారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఏసీ థియేటర్లలో అత్యధికంగా రూ.100, లోయర్‌ క్లాస్‌లో రూ.40లు ఉండాలని కోరారు. ఇక కార్పొరేషన్‌లో నాన్‌ ఏసీలో అత్యధికంగా రూ. 100, లోయర్‌ క్లాస్‌లో రూ.40 ఉండాలని, నాన్‌ ఏసీలో ఇతర ప్రాంతాల్లో రూ. 80, రూ.30 ఉండాలని కోరారు డిస్టిబ్యూటర్లు. మరి డిస్టిబ్యూటర్లు ప్రతిపాదన పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోసిన రష్మి గౌతమ్… ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Bhanu Shree: బ్యూటిఫుల్ ఔట్ పిట్ పిచ్చెకిస్తున్న భాను శ్రీ లేటెస్ట్ పిక్స్

Deepika Pilli:వంగ పండు దుస్తుల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న బ్యూటి .