AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసా.. ఆ సన్నివేశాలప్పుడు భయమేసిందన్న సాయిపల్లవి..

నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి టాక్ సొతం చేసుకుంది. దాదాపు రెండేళ్ల తర్వాత నాని నటించిన సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది.

Sai Pallavi: థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసా.. ఆ సన్నివేశాలప్పుడు భయమేసిందన్న సాయిపల్లవి..
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Dec 28, 2021 | 5:52 PM

Share

Sai Pallavi: నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి టాక్ సొతం చేసుకుంది. దాదాపు రెండేళ్ల తర్వాత నాని నటించిన సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది. పిరియాడికల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాని, కృతి శెట్టి, సాయి పల్లవి దిల్ రాజు పాల్గొన్నారు. ఈసందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ…

‘థియేటర్లో ప్రేక్షకుల రియాక్షన్ చూసి ఎంతో సంతృప్తిగా అనిపించింది అని అన్నారు. ఎవ్వరు గుర్తుపట్టకుండా థియేటర్ లో సినిమా  చూసాను .. సినిమా చూస్తుంటే ముందే ప్రేక్షకులు డైలాగులు చెప్పేస్తున్నారు. అంటే సినిమాను రెండు మూడు సార్లు చూసారు అని అర్ధమైంది.. అలాగే  నా పాత్ర వచ్చేసరికి భయం వేసింది నా క్యారెక్టర్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నా.. కానీ ప్రేక్షకులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. సత్యదేవ్, రాహుల్ గారికి థ్యాంక్స్… ఇంత మంచి పాత్రను రాసినందుకు. పేపర్‌లో ఏదైనా రాసుకోవచ్చు. కానీ ఆ సినిమా ఇంకా అందరికీ గుర్తుంది అంటే దానికి కారణం రాహుల్. సాను గారి అందించిన విజువల్స్ అద్బుతంగా ఉన్నాయి. నీరజ గారి క్యాస్టూమ్ వల్లే అంత అందంగా కనిపించాం. కృతి శెట్టి స్వీట్ డార్లింగ్. ఆమెకు మున్ముందు మరిన్ని విజయాలు రావాలి. నిర్మాత వెంకట్ గారు నాకు ఫ్యామిలీ కంటే ఎక్కువ. ఎవరికి ఇబ్బంది ఉంది అన్నా.. రోజంతా వేస్ట్ అయిపోయినా కూడా పట్టించుకోరు. నాకు మనీ కాదు.. మంచి సినిమా తీయాలని అనేవారు. ఈ చిత్రంలో భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉంది. ఇక నాని గారు.. డౌన్ టు ఎర్త్ అనే వ్యక్తిత్వం ఆయనది. ఇప్పటికీ తన సినిమాను తొలి సినిమాగానే భావిస్తుంటారు’ అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood: సినిమా టికెట్ ధరలు ఇలా నిర్ణయించండి.. ఏపీ సర్కార్‌కు డిస్టిబ్యూటర్ల ప్రతిపాదన..

Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..

Allu Arjun: ఎమోషనల్ అయిన అల్లు అర్జున్.. బన్నీ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సుకుమార్..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?