Tollywood : సినిమా టికెట్ల అంశం పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అదేంటంటే..

సినిమా టికెట్ల ధరల విషయం రోజు రోజుకు అనేక మలుపులు తిరిగుతుంది. సినిమాటిక్ సినిమా పెద్దలు ఈ విషయం పై ప్రభుత్వం తో చర్చించడానికి ప్రయత్నిస్తున్నారు.

Tollywood : సినిమా టికెట్ల అంశం పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అదేంటంటే..
Ap
Follow us

|

Updated on: Dec 28, 2021 | 6:17 PM

Tollywood : సినిమా టికెట్ల ధరల విషయం రోజు రోజుకు అనేక మలుపులు తిరిగుతుంది. సినిమాటిక్ సినిమా పెద్దలు ఈ విషయం పై ప్రభుత్వం తో చర్చించడానికి ప్రయత్నిస్తున్నారు. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా సినిమా టికెట్ ధరలు ఉండాలంటుంది ఏపీ ప్రభుత్వం.. అలా అయితే సినిమాకు నష్టాలు వస్తాయని అంటున్నారు సినీపెద్దలు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని అని కోరుతున్నారు. ఇదిలా ఉంటే నేడు ఏపీ మంత్రి పేర్ని నానితో డిస్టిబ్యూటర్స్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సినిమా టికెట్ ధరల విషయంలో వారి ప్రతిపాదనను వినిపించారు. ఈ భేటీలో సినిమా టికెట్ల రేట్లు పెంచాలన్నది డిస్ట్రిబ్యూటర్ల ప్రతిపాదన. వాళ్లు ఎక్కడ, ఎంత పెంచాలని కోరెంటే.. కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో అత్యధికంగా రూ.150, అలాగే లోయర్‌ క్లాస్‌లో రూ. 50లు ఉండాలని డిస్ట్రిబ్యూటర్లు కోరారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఏసీ థియేటర్లలో అత్యధికంగా రూ.100, లోయర్‌ క్లాస్‌లో రూ.40లు ఉండాలని కోరారు. ఇక కార్పొరేషన్‌లో నాన్‌ ఏసీలో అత్యధికంగా రూ. 100, లోయర్‌ క్లాస్‌లో రూ.40 ఉండాలని, నాన్‌ ఏసీలో ఇతర ప్రాంతాల్లో రూ. 80, రూ.30 ఉండాలని కోరారు డిస్టిబ్యూటర్లు.

అయితే  సినిమా టికెట్ల అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఈ కమిటీలో సభ్యులుగా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ గోయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉంటారు.  టికెట్ల అంశంపై పూర్తి సర్వ్ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది ఈ కమిటీ..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood: సినిమా టికెట్ ధరలు ఇలా నిర్ణయించండి.. ఏపీ సర్కార్‌కు డిస్టిబ్యూటర్ల ప్రతిపాదన..

Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..

Allu Arjun: ఎమోషనల్ అయిన అల్లు అర్జున్.. బన్నీ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సుకుమార్..

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!